First Mirror: అద్దాన్ని ఎవరు కనిపెట్టారు? మొదటిసారి అద్దంలో ముఖాన్ని ఎవరు చూసుకున్నారో తెలుసా?

|

Oct 10, 2023 | 6:10 AM

Mirror Discover: ఇంటి నుంచి బయటకు వెళ్తున్నామంటే చాలు.. ముందుగా అద్దం ముందు వాలిపోయి తల దువ్వుకోవడం, ముఖానికి ఫౌడర్ వేసుకోవడం వంటివి చేస్తుంటాం. ఇక ఫంక్షన్స్, అకేషన్స్ విషయానికి వస్తే.. అద్దం ముందు నుంచి కదలడం చాలా కష్టమనే చెప్పాలి. ఫుల్‌గా మేకప్ వేసుకోవడం, రెడీ అవడానికి అద్దం ముందు గంటల తరబడి నిల్చుండిపోతారు. మరి ఇప్పుడంటే అద్దం ఉంది..

First Mirror: అద్దాన్ని ఎవరు కనిపెట్టారు? మొదటిసారి అద్దంలో ముఖాన్ని ఎవరు చూసుకున్నారో తెలుసా?
Mirror History
Follow us on

Mirror Discover: ఇంటి నుంచి బయటకు వెళ్తున్నామంటే చాలు.. ముందుగా అద్దం ముందు వాలిపోయి తల దువ్వుకోవడం, ముఖానికి ఫౌడర్ వేసుకోవడం వంటివి చేస్తుంటాం. ఇక ఫంక్షన్స్, అకేషన్స్ విషయానికి వస్తే.. అద్దం ముందు నుంచి కదలడం చాలా కష్టమనే చెప్పాలి. ఫుల్‌గా మేకప్ వేసుకోవడం, రెడీ అవడానికి అద్దం ముందు గంటల తరబడి నిల్చుండిపోతారు. మరి ఇప్పుడంటే అద్దం ఉంది.. మరి పూర్వకాలంలో మనుషులు తమ ముఖాన్ని ఎలా చూసుకునేవారు.. అసలు అద్ద ఎలా వచ్చింది? ఎవరు కనిపెట్టారు.

అద్దం ఆవిష్కరణకు ముందు.. ప్రజలు తమ ముఖాలను చూడటం కష్టమే కాదు, అసాధ్యం కూడా. కానీ అద్దాలు వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ రోజుల్లో మనం అద్దం లేకుండా కూడా ఉండలేకపోతున్నాం. ఉదయం లేవగానే అద్దంలో ముఖం చూసుకుంటాం, తలస్నానం చేస్తాం, షేవ్ చేసుకుంటాం, మేకప్ చేసుకుంటాం. అద్దం లేకుండా మన లుక్ ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో తెలుసుకోలేం. అద్దంలో చూసుకోవడం ద్వారా మన జుట్టును దువ్వుకుంటాం. డ్రెస్ సెట్ చేసుకుంటాం. అద్దాలు లేకుండా అలంకరించుకోవడం చాలా కష్టం. కానీ ఈ అద్దం ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చింది. అసలు ఈ అద్దాన్ని ఎవరు కనిపెట్టారు. అద్ద ఆవిష్కరణకు ముందు పరిస్థితులు ఎలా ఉండేవి? ఇంట్రస్టింగ్ వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చారిత్రాత్మకంగా చెప్పాలంటే, అద్దంలో ప్రతిబింబాన్ని చూసుకోవడం అనేది చాలా పాత విషయం. అనేక శతాబ్దాలుగా ప్రజలు తమ ముఖాలను చూడటానికి, అలంకరించుకోవడానికి అద్దాన్ని ఉపయోగిస్తున్నారు. మరి అద్దంలో చూసుుకోవడం అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది? మొదటిసారిగా అద్దాన్ని ఎవరు వినియోగించారు? అద్దంలో ఎవరు తమ ముఖాన్ని మొదటిసారిగా చూసుకున్నారో చూద్దాం.

ఇవి కూడా చదవండి

అద్దం చరిత్ర..

1835లో అద్దాన్ని కనిపెట్టారని చెబుతారు. జర్మన్ రసాయన శాస్త్రవేత్త జస్టస్ వాన్ లీబిగ్ గాజు పేన్ ఉపరితలంపై లోహపు అంటే వెండి పలుచని పొరను పూయడం ద్వారా దానిని సృష్టించాడు. అయితే ఇంతకు ముందు సామాన్యులు అద్దాలు వినియోగించలేదు. పేదలకు అద్దాలు అందుబాటులో లేవు. ఆ రోజుల్లో ఇంట్లో అద్దం పెట్టుకోవడం విలాసంగా భావించేవారు. అలాంటి పరిస్థితిలో, చాలా మంది ప్రజలు నీటి ఉపరితలంపై వారి ముఖాన్ని చూసుకునేవారట. వాస్తవానికి అద్దం పురాతన కాలం నుండి వాడుకలో ఉంది. అయితే, 18వ శతాబ్దం వరకు అది సామాన్యులకు అందుబాటులో లేదు. 18వ శతాబ్దంలో అద్దం తయారీలో మెరుగుదల, యాంత్రీకరణ.. అద్దం ధరను తగ్గించి సామాన్యులకు అందుబాటులోకి తెచ్చాయి. అప్పటి నుండి అద్దం వాడకం వేగంగా పెరిగింది.

పూర్తం ప్రజలు ముఖాలను ఇలా చూసుకునేవారు..

నీటి ఉపరితం, మెరుస్తున్న మెటల్, మృదువైన రాళ్లు వంటి వాటిపై ప్రజలు తమ ముఖాన్ని చూసుకునేవారట. కొంతమంది శుభ్రమైన రాగి, వెండి పాత్రలను అద్దాలుగా ఉపయోగించారట. ధనిక వర్గానికి చెందిన ప్రజలు వెండితో చేసిన చిన్న అద్దాలను ఉపయోగించారని చరిత్ర చెబుతోంది. మరికొంతమంది ఒకరి సహాయంతో వారి ముఖాలకు అలంకరణలను చేసుకునేవారట. చిత్రకారులు నీరు, చమురు ఉపరితలంపై ప్రతిబింబాన్ని చూసి పెయింటింగ్‌లను రూపొందించేవారని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..