ఒక వ్యక్తిపై సెన్సిటివ్ అనే ముద్ర ఎందుకు పడుతుందో తెలుసా.. మూడ్ స్వింగ్స్ మారిపోవడానికి కారణాలివే..

|

Dec 06, 2022 | 12:25 PM

ప్రపంచంలో మనుషులంతా ఒకేలా ఉండరు. అంత వరకు ఎందుకు ఓ కుటుంబంలోని మనుషుల మనస్థత్వమే ఒకేలా ఉండదు.. ఓ ఫ్యామిలీలో నలుగురు ఉంటే నాలుగు రకాల మనస్థత్వాలు ఉంటాయి. సాధారణంగా కొంతమంది..

ఒక వ్యక్తిపై సెన్సిటివ్ అనే ముద్ర ఎందుకు పడుతుందో తెలుసా.. మూడ్ స్వింగ్స్ మారిపోవడానికి కారణాలివే..
Sensitive Person (representative Image)
Follow us on

ప్రపంచంలో మనుషులంతా ఒకేలా ఉండరు. అంత వరకు ఎందుకు ఓ కుటుంబంలోని మనుషుల మనస్థత్వమే ఒకేలా ఉండదు.. ఓ ఫ్యామిలీలో నలుగురు ఉంటే నాలుగు రకాల మనస్థత్వాలు ఉంటాయి. సాధారణంగా కొంతమంది వ్యవహరశైలి.. మరికొంతమందికి నచ్చదు. కొంతమంది ప్రవర్తనా శైలి ఆధారంగా వాడు సెన్సిటివ్‌రా చాలా జాగ్రత్తగా ఉండాలంటుంటారు. అంటే ఆ వ్యక్తి యొక్క వ్యవహరశైలి.. ఒక విషయాన్ని రిసీవ్ చేసుకునే విధానం ఆధారంగా సెన్సిటివ్ అనే ముద్ర పడిపోతుంది. నిజంగా కూడా సెన్సిటివ్ మైండ్ సెట్ కలిగిన వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వినే సామర్థ్యం, ఆలోచించే విధానం, సహనం, అవగాహనా స్థాయి సెన్సిటివ్ వ్యక్తిగా మార్చేస్తాయి. ఇలాంటి వ్యక్తులు ఎదుటివారిని అర్థం చేసుకోవడానికి, చుట్టూ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. కానీ ఒక్కసారి సెన్సిటివ్ మైండ్ సెట్‌ ఉన్న వ్యక్తులు కనెక్ట్‌ అయ్యారంటే చాలా బాగా కలిసిపోతారు. నమ్మినవాళ్ల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం అవడానికి రెడీ అవుతారు. అదే తాను నమ్మిన వ్యక్తి మోసం చేస్తున్నాడని తెలిస్తే మాత్రం ఆ వ్యక్తితో లైఫ్‌లో కనెక్ట్‌ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఓ వ్యక్తి యొక్క సెన్సిటివ్ నెస్ ప్రశాంతత, ఆనందం, విజయం, ఆరోగ్యం, మానసిక ఆరోగం వంటివాటిపై చాలా ప్రభావం చూపిస్తుంది. ఒక్కోసారి వీటిని పొందాలంటే వాళ్లు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వివిధరకమైన ఆలోచనలతో ఎప్పుడూ సతమతమవుతూ ఉంటారు.

చిన్న చిన్న విషయాలకు ఎక్కువ సంతోషపడిపోవడం, బాధపడిపోవడం అనేది సెన్సిటివ్‌ మైండ్‌సెట్‌ ఉన్నవారి లక్షణంగా చెబుతుంటారు. వాళ్ల మూడ్ స్వింగ్స్ తరచూ మారిపోతూ ఉంటాయి. వాళ్లకి ఏమికావాలనే విషయంపై కూడా స్పష్టత ఉండదు. కూడా త్వరగా తేల్చుకోలేరు. ఇలా ఎందుకు జరిగింది. అలా ఎందుకు జరుగుతుంది అని వివిధ ప్రశ్నలతో సతమతమవుతూ ఉంటారు. కొన్ని ప్రతికూల ఆలోచనలను వదిలేయడం వారికి చాలా కష్టంగా ఉంటుంది. అంత సులువుగా వారు వారి ఆలోచనలను వదలలేరు. ఇది వారికి తలనొప్పి, నిద్రలేమి, ఆందోళన, స్ట్రెస్, బాధ, కోపం మొదలైన సమస్యలకు కారణమవుతుంది.

సెన్సిటివ్ మైండ్‌సెట్‌ ఉన్నవారిని మొదట అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. వారికి కాస్త సమయం ఇవ్వాలి. వారికి పరిస్థితుల గురించి వివరించాలి. ఎంత విన్నా.. వారు అర్థం చేసుకోకుండా.. వారి ఆలోచనల్లోనే మునిగిపోతూ ఉంటే.. ఆ పరిస్థితులకు దూరంగా ఉంచి.. కాస్త సానుకూల అంశాలు వారి చుట్టూ ఉండేలా క్రియేట్ చేయాలి. ఇలా చేస్తే.. వారి ఆలోచనలు కొంతమేర డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా వారిపై విసుక్కుని, వీళ్లకు ఎంత చెప్పినా అర్థం కాదు అని అనకండి. అలా చేస్తే మీపై వారికుండే అభిప్రాయం మారడమే కాకుండా.. వారిలో మీరు ఆశించే మార్పు రావడం కష్టమవుతుంది. ఓ వ్యక్తిపై సెన్సిటివ్ అనే ముద్ర వేసినప్పుడు.. అవతలి వ్యక్తి తనలో లోపాలను బేరీజు వేసుకోవాలి. ఓ వ్యక్తి చుట్టుపక్కల పరిసరాల ప్రభావం, పెరిగే వాతావరణం కారణంగా ఆ వ్యక్తిలో సెన్సిటివ్ మైండ్ సెట్‌కు కారణం కావచ్చు అనే విషయాన్ని మాత్రం గుర్తించుకోవాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం చూడండి..