Kiss Day 2021: ముద్దుతో ముచ్చటైన ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకుందా పదండి

ముద్దు.. ప్రేమను వ్యక్తపరిచే ఒక సాధనం. ఆప్యాయతను పంచే చిలిపి అనుభవం. రొమాన్స్‌కు ఆరంభం ముద్దు అని ప్రత్యేకంగా చెప్పాలా..?. ముద్దు అంటే కేవలం ఇద్దరి పెదవుల కలయిక మాత్రమే కాదు.

Kiss Day 2021: ముద్దుతో ముచ్చటైన ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకుందా పదండి

Edited By:

Updated on: Feb 14, 2022 | 5:17 PM

Kiss Day 2021:  ముద్దు.. ప్రేమను వ్యక్తపరిచే ఒక సాధనం. ఆప్యాయతను పంచే చిలిపి అనుభవం. రొమాన్స్‌కు ఆరంభం ముద్దు అని ప్రత్యేకంగా చెప్పాలా..?. ముద్దు అంటే కేవలం ఇద్దరి పెదవుల కలయిక మాత్రమే కాదు. అదో ఎమోషన్ ఎక్చ్సేంజ్. భాగస్వామికి లేదా ప్రేయసికి సారీ చెప్పడానికి కూడా ముద్దు మంచి సాధకమే కదా..!. లిప్ కిస్, నుదుటిమీద పెట్టే ముద్దు, చెంపల మీద పెట్టే ముద్దు, మెడపై పెట్టే ముద్దు ఇలా చాలా రకాల ముద్దులున్నాయి. ప్రస్తుతం కరోనా సమయాన్ని మినహాయిస్తే.. ముద్దుతో ఎన్నో ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముద్దు పెట్టుకోవడం వల్ల శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. శనివారం (ఫిబ్రవరి 13)  కిస్ డే ఈ క్రమంలో ముద్ద వలన కలిగే ముచ్చటైన ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

 

  1. గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ముద్దే మంచి మందని చాలా పరిశోధనల్లో తేలింది
  2. ఒక జంట ముద్దు పెట్టుకుంటే ఇద్దరిలో 10 నుంచి 15 కేలరీల శక్తి ఖర్చువుతుందట
  3. ముద్దుకు తలనొప్పి తగ్గించే శక్తి ఉందంట
  4. ముద్దు పెట్టుకొనేప్పుడు శరీరంలో అడ్రినాలిన్ అనే రసాయనం రిలీజ్ అవుతుంది. ఇది వివిధ రకాల నొప్పులను తగ్గిస్తుంది
  5. ముద్దు మంచి రిఫ్రెష్‌మెంట్.. అంతేకాదు ఒత్తిడి నుంచి దూరం కావడానికి కూడా ముద్దు చాలా అవసరం.
  6. లిప్ కిస్‌తో మెడ, దవడ కండరాలకు మంచి వ్యాయామం లభిస్తుంది. రోజు ముద్దు పెట్టుకుంటే ఫేస్‌లో గ్లో పెరుగుతుంది.
  7. ఒక్క ముద్దుతో మీ ముఖంలోని 34 కండరాలతో పాటు 112 పోస్ట్రల్ కండరాలకు ఉత్తేజం కలుగుతుంది.

 

ఇవే కాదు.. ఇంకా చాలా రకాల ప్రయోజనాలు ముద్దు ద్వారా లభిస్తాయి. ఈ రోజు కిస్ డే. అయితే మాత్రం కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా పోలేదు కాబట్టి కాస్త.. ఆచి తూచి అడుగులు వేయండి.

 

Also Read:

Uppena first day collection: మెగా మేనల్లుడి రికార్డ్.. తొలిరోజు ‘ఉప్పెన’లా వచ్చిన కలెక్షన్స్

ఏంటి సామి ఇది.. ఏకంగా షాపు లోడునే అక్రమంగా తరలిస్తున్నారుగా..! అది కూడా కోళ్ల ఎరువు పేరుతో

 

 

 

Follow Us