Money Astrology 2025: గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!

| Edited By: Janardhan Veluru

Dec 29, 2024 | 10:27 PM

Guru Gochar 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహం ఏమాత్రం అనుకూల స్థానంలో ఉన్నా ఆ రాశివారు తప్పకుండా సంపన్నులయ్యే అవకాశం ఉంటుంది. గురువు ఏ స్థానాలకు అధిపతి అయినప్పటికీ, 2, 5, 7, 9, 11 స్థానాల్లో సంచారం చేస్తున్న పక్షంలో కొన్ని రాశుల వారు కొద్ది ప్రయత్నంతో భాగ్యవంతులు కావడం జరుగుతుంది. కొత్త సంవత్సరంలో గురు గ్రహం అనుకూలత కారణంగా కొందరు సంపన్నులు కాబోతున్నారు.

Money Astrology 2025: గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
Guru Gochar 2025
Follow us on

Astrology 2025: జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ గురు గ్రహం ఏమాత్రం అనుకూల స్థానంలో ఉన్నా ఆ రాశివారు తప్పకుండా సంపన్నులయ్యే అవకాశం ఉంటుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. గురువు ఏ స్థానాలకు అధిపతి అయినప్పటికీ, 2, 5, 7, 9, 11 స్థానాల్లో సంచారం చేస్తున్న పక్షంలో కొన్ని రాశుల వారు కొద్ది ప్రయత్నంతో భాగ్యవంతులు కావడం జరుగుతుంది. కొత్త ఏడాదిలో మే తర్వాత గురువు మిథున రాశిలో ప్రవేశించి, 2026 మే వరకు అదే రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. ఈ సంచారం వల్ల వృషభం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారు తప్పకుండా ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది.

  1. వృషభం: ఈ రాశికి లాభాధిపతిగా గురువు ధన స్థానంలో సంచారం చేయబోతున్నందువల్ల ఈ రాశివారు 2025ద్వితీయార్థంలో తప్పకుండా భాగ్యవంతులయ్యే అవకాశం ఉంది. సాధారణంగా వీరు తమ ప్రతిభా పాటవాలు, నైపుణ్యాలు, పొదుపరితనం, మదుపు చేయడం వంటి కారణాల వల్ల ధనికు లయ్యే అవకాశం ఉంటుంది. పెట్టుబడులు, షేర్లు, స్పెక్యులేషన్లు, వడ్డీ వ్యాపారాలు, ఆర్థిక లావా దేవీల వల్ల వీరి ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది.
  2. సింహం: ఈ రాశికి పంచమ స్థానాధిపతిగా గురువు లాభ స్థానంలో ప్రవేశిస్తున్నందువల్ల ఆకస్మిక దన ప్రాప్తికి అవకాశం ఉంది. లాభదాయక పరిచయాలు పెంపొందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో విశేషంగా లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులతో పాటు జీతభత్యాలు వృద్ధి చెందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల అపార ధనలాభం కలుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది.
  3. తుల: ఈ రాశికి గురువు భాగ్య స్థానంలో ప్రవేశించడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. విదేశీ సంపాదనను అనుభవించే యోగం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందడం జరుగుతుంది. అదనపు ఆదాయ మార్గాల వల్ల ఆశించిన ఆర్థిక లాభం కలుగు తుంది. లాభదాయక పరిచయాలు వృద్ధి చెందుతాయి. రావలసిన సొమ్మంతా చేతికి అందుతుంది.
  4. ధనుస్సు: రాశ్యధిపతి గురువు సప్తమ స్థాన సంచారం వల్ల ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు కనక వర్షం కురిపిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల పరంగా విశేషమైన పురోగతి సాధిస్తాయి. ఉద్యోగంలో జీతభత్యాలు, అదనపు ఆదాయం ఆశించిన దాని కంటే ఎక్కువగా వృద్ధి చెందుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది.
  5. కుంభం: ఈ రాశికి ధన, లాభాధిపతి అయిన గురువు పంచమ స్థానంలో ప్రవేశించడం వల్ల ఆదాయపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా రెట్టింపు ఫలితాలనిస్తుంది. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులు, అధిక వేతనం, అదనపు ఆదాయానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు భారీ జీతభత్యా లతో విదేశాల్లో ఉద్యోగాలు లభించే సూచనలున్నాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి.