Smart Helmet: స్మార్ట్‌ హెల్మెట్‌.. ప్రమాదం జరిగితే వెంటనే అంబులెన్స్‌కు కాల్‌ చేస్తుంది..!

|

Nov 22, 2023 | 5:38 PM

హెల్మెట్‌లో ఎమర్జెన్సీ బటన్‌ను ఇన్‌స్టాల్ చేసి, నొక్కినప్పుడు, అంబులెన్స్ డాక్టర్ లేదా కుటుంబ సభ్యుల నంబర్‌కు ఆటోమెటిక్‌గా కాల్ వెళ్తుంది. తద్వారా ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్ళి అతని ప్రాణాలు కాపాడవచ్చు. ఈ హెల్మెట్ రోడ్డు ప్రమాదాల నుండి మిమ్మల్ని రక్షించడమే కాకుండా పెరుగుతున్న వాయు కాలుష్యం నుండి ఉపశమనం కలిగిస్తుంది. హెల్మెట్ పైభాగంలో ఎయిర్ ఫిల్టర్ అమర్చబడి ఉంది. అది కలుషిత గాలిని ఫిల్టర్ చేసి హెల్మెట్ లోపల స్వచ్ఛమైన గాలిని చేరుస్తుంది.

Smart Helmet: స్మార్ట్‌ హెల్మెట్‌.. ప్రమాదం జరిగితే వెంటనే అంబులెన్స్‌కు కాల్‌ చేస్తుంది..!
Helmet
Follow us on

మన దేశంలో అత్యధిక మరణాలు రోడ్డు ప్రమాదాల వల్లే సంభవిస్తాయి. దేశంలో ప్రతి గంటకు 53 ప్రమాదాలు జరుగుతున్నాయని ఓ సర్వే తెలిపింది. దేశంలో పటిష్టమైన చట్టాలు, హెల్మెట్ తప్పనిసరి చేసినా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.. అయితే ఇప్పుడు సరికొత్త టెక్నాలజీతో అద్భుతమైన హెల్మెట్‌ అందుబాటులోకి వచ్చింది. ఇది అల్లాటప్ప హెల్మెట్‌ కాదు.. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ఆటోమేటిక్‌గా అంబులెన్స్‌కి ఫోన్ చేస్తుంది. ఈ అద్భుత టెక్నాలజీ కలిగిన హెల్మెట్‌ తయారీలో ఐటిఎం గిడా గోరఖ్‌పూర్‌కు చెందిన ముగ్గురు మెకానికల్ సెంకడ్‌ ఇయర్‌ విద్యార్థులు ఈ ఘనత సాధించారు.

మెకానికల్‌ విద్యార్థులు షుజిత్ యాదవ్, శుభమ్ కుమార్, ఆదిత్య యాదవ్‌లు తమ డిపార్ట్‌మెంట్‌ హెచ్‌ఓడీ వినీత్ రాయ్ నేతృత్వంలో కలిసి రోడ్డు ప్రమాదంలో మీ ప్రాణాలను కాపాడడమే కాకుండా మీ కుటుంబ సభ్యులకు, వైద్యులకు సమాచారం అందించేలా, ప్రమాదం జరిగినప్పుడు రక్షించే హెల్మెట్‌ను తయారు చేశారు. ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే వైద్యం అందిస్తే బాధితుల ప్రాణాలను రక్షించవచ్చనే లక్ష్యంతో విద్యార్థులు ఈ హెల్మెట్‌ని రూపొందించారు. దీంతో పాటు విద్యార్థులు తయారు చేసిన హెల్మెట్ వాతావరణ కాలుష్యం నుండి కూడా మిమ్మల్ని కాపాడుతుంది. విద్యార్థులు హెల్మెట్‌ను పి.పి. పొల్యూషన్ ప్రొటెక్షన్ హెల్మెట్‌గా నామకరణం చేశారు.

హెల్మెట్ ఎలా పని చేస్తుంది?..

ఇవి కూడా చదవండి

మోటార్ సైకిల్ నడుపుతున్నప్పుడు హెల్మెట్‌లో అమర్చిన పరికరాన్ని మొబైల్‌కు కనెక్ట్ చేసే విధంగా హెల్మెట్‌ను రూపొందించారు. కనెక్ట్ చేసినప్పుడు, హెల్మెట్‌లో ఇన్‌స్టాల్ చేయబడిన పరికరం యాక్టివ్‌ అవుతుంది. హెల్మెట్‌లో ఎమర్జెన్సీ బటన్‌ను ఇన్‌స్టాల్ చేసి, నొక్కినప్పుడు, అంబులెన్స్ డాక్టర్ లేదా కుటుంబ సభ్యుల నంబర్‌కు ఆటోమెటిక్‌గా కాల్ వెళ్తుంది. తద్వారా ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్ళి అతని ప్రాణాలు కాపాడవచ్చు. ఈ హెల్మెట్ రోడ్డు ప్రమాదాల నుండి మిమ్మల్ని రక్షించడమే కాకుండా పెరుగుతున్న వాయు కాలుష్యం నుండి ఉపశమనం కలిగిస్తుంది. హెల్మెట్ పైభాగంలో ఎయిర్ ఫిల్టర్ అమర్చబడి ఉంది. అది కలుషిత గాలిని ఫిల్టర్ చేసి హెల్మెట్ లోపల స్వచ్ఛమైన గాలిని చేరుస్తుంది. హెల్మెట్‌లో బ్లూటూత్ మాడ్యూల్, 3.7 వోల్టేజ్ బ్యాటరీ, ఎయిర్ ఫిల్టర్‌ ఏర్పాటు చేశారు. రెడ్‌లైట్‌ సింబల్‌తో హెల్మెట్‌ తయారుచేశారు.

మరిన్ని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వార్తల కోసం క్లిక్‌ చేయండి..