AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google Maps: గూగుల్ మ్యాప్స్‌‌లో అడ్రస్ వెతుకోవడమే కాదు.. మీ చుట్టూ ఉండే గాలి నాణ్యతను కూడా చెక్ చేసుకోవచ్చు.. ఎలానో తెలుసుకోండి..

గూగుల్ మ్యాప్స్‌ ఎయిర్ క్వాలిటీ ఫీచర్ ద్వారా మీరు వివిధ ప్రదేశాలలో గాలి నాణ్యత గురించి సమాచారాన్ని పొందవచ్చు. దాని ప్రక్రియను అర్థం చేసుకుందాం.

Google Maps: గూగుల్ మ్యాప్స్‌‌లో అడ్రస్ వెతుకోవడమే  కాదు.. మీ చుట్టూ ఉండే గాలి నాణ్యతను కూడా చెక్ చేసుకోవచ్చు.. ఎలానో తెలుసుకోండి..
Google Maps Feature
Sanjay Kasula
|

Updated on: Nov 17, 2022 | 2:56 PM

Share

ఒక ప్రదేశానికి చేరుకోవడానికి లేదా సరైన దిశను తెలుసుకోవడానికి తరచుగా మనం గూగుల్‌ మ్యాప్స్‌ని ఉపయోగిస్తుంటాం. అయితే మనకు సరైన రూట్‌ను చూపడమే కాకుండా.. మీ నగరానికి సంబంధించిన అనేక ముఖ్యమైన వివరాలను కూడా గూగుల్‌ మ్యాప్స్ అందజేస్తుందని మీకు తెలుసా.. ప్రస్తుతం, ఢిల్లీ-NCR దాని పరిసర ప్రాంతాల్లో కాలుష్య స్థాయి మాత్రమే కాదు మన నగరంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా కొద్ది అలాంటి పరిస్థితే ఉంటుంది. దీని కారణంగా గాలి నాణ్యత స్థాయి చాలా దారుణంగా మారుతోంది. అంతెందుకు మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యతను గుర్తించాలని అనుకుంటే.. గూగుల్ మ్యాప్స్‌ మీకు ఆ సమాచారాన్ని అందిస్తుంది. గూగుల్ మ్యాప్స్ ఈ ఫీచర్ వివిధ ప్రదేశాలలో గాలి నాణ్యత గురించి సమాచారాన్ని అందిస్తుంది. దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

రంగు ద్వారా గాలి నాణ్యతను గుర్తించండి..

1. ఎరుపు రంగు – తక్కువ గాలి నాణ్యత, అధిక కాల్యుష్యం

2. నారింజ, పసుపు – తక్కువ పేలవమైన, కొద్దిగా తక్కువ గాలి నాణ్యత కలిగిన ప్రాంతం

3. గ్రీన్ కలర్ – క్లీన్ ఎయిర్ క్వాలిటీ

గూగుల్ మ్యాప్స్ ద్వారా, మీరు వివిధ ప్రదేశాలలో గాలి నాణ్యత గురించి సమాచారాన్ని పొందవచ్చు. మీరు గూగుల్ మ్యాప్స్‌లో ఈ ఫీచర్‌ను ఉపయోగించినప్పుడు.. ఎరుపు రంగు గుర్తులతో పేలవమైన గాలి నాణ్యత ఉన్న ప్రాంతాలను మీరు తెలుసుకోవచ్చు. అయితే తక్కువ పేలవమైన, కొద్దిగా తక్కువ గాలి నాణ్యత ఉన్న ప్రాంతాలు నారింజ, పసుపు గుర్తులతో కనిపిస్తాయి. గాలి నాణ్యత శుభ్రంగా ఉండే ప్రదేశాలు, మీరు వాటిని ఆకుపచ్చ గుర్తులతో చూస్తారు. గూగుల్ మ్యాప్స్‌ ద్వారా ఒక ప్రదేశంలోని గాలి నాణ్యతను ఎలా గుర్తించవచ్చో వివరంగా తెలుసుకుందాం.

ఇలా తెలుసుకోండి..

  • ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ యాప్‌ను ఓపెన్ చేయండి.
  • ఇప్పుడు ఎగువ-ఎడమ మూలలో ప్రొఫైల్ చిహ్నం క్రింద, మీరు ‘మై టైప్’ చిహ్నాన్ని చూస్తారు
  • మీరు ఈ ఐకాన్‌పై క్లిక్ చేసిన వెంటనే, ‘మ్యాప్ వివరాలు’ ఎంపిక చూడవచ్చు.
  • మీరు ‘మ్యాప్ వివరాలు’ విభాగంలో ‘ఎయిర్ క్వాలిటీ’ ఎంపికను చూస్తారు
  • ‘ఎయిర్ క్వాలిటీ’ సెక్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా, మీరు మీ ప్రాంతంలోని ‘ఎయిర్ క్వాలిటీ’ గురించిన సమాచారాన్ని పొందుతారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం