Gold Prices Drop: మహిళలకు గుడ్ న్యూస్. వరుసగా మూడో రోజు బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడ్డాయి. తాజాగా పసిడి ధర రూ. 232 తగ్గగా.. వెండి ధర ఏకంగా రూ. 1,955 తగ్గింది. దీనితో ఢిల్లీ మార్కెట్‌లో 10 క్యారెట్ల బంగారం ధర రూ. 47, 387కు చేరుకోగా.. వెండి కేజీ రూ. 67,605 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా పసిడి ధరలు క్షీణిస్తుండటంతో దేశీయంగానూ వాటి రేట్లు తగ్గుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. అలాగే డాలరు విలువ బలపడటం, ఈక్విటీ మార్కెట్లు రాణిస్తుండటం వంటి అంశాలు అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయని బిజినెస్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. కాగా, అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర 1835 డాలర్లు ఉండగా.. వెండి ఔన్స్ ధర రూ. 26.78గా ఉంది.
Also Read:
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా దిగొచ్చిన బంగారం ధరలు.. వరుసగా రెండో రోజు ఎంతంటే.!
ప్రభాస్ ‘ఆదిపురుష్’ సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. చిత్ర యూనిట్ తప్పిన పెను ముప్పు..