వినియోగదారులారా బీ అలెర్ట్.. డీమార్ట్ పేరుతో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న ఫేక్‌లింక్.. క్లిక్ చేశారో అంతే సంగతులు..
డీమార్ట్ 20వ వార్షికోత్సవం సందర్భంగా గిఫ్ట్ వోచర్లు, బహుమతులు అంటూ వాట్సాఫ్‌లో మెసేజ్‌లు వస్తున్నాయా అయితే ఒక్కసారి గమనించండి. అవన్నీ ఫేక్ మెసేజ్‌లు ఏకంగా డీ మార్ట్
డీమార్ట్ 20వ వార్షికోత్సవం సందర్భంగా గిఫ్ట్ వోచర్లు, బహుమతులు అంటూ వాట్సాఫ్‌లో మెసేజ్‌లు వస్తున్నాయా అయితే ఒక్కసారి గమనించండి. అవన్నీ ఫేక్ మెసేజ్‌లు ఏకంగా డీ మార్ట్ సంస్థనే ప్రకటించింది. సోషల్ మీడియాలో వస్తున్నట్లు మేం ఎలాంటి గిఫ్ట్ వోచర్లు, కూపన్లు ఇవ్వడం లేదని వెల్లడించింది. ఇప్పటికే వాట్సాప్ గ్రూపు ద్వారానో లేదా వ్యక్తిగతంగానో మీకూ వచ్చే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఆ లింక్‌పై క్లిక్ చేయకండి. ఎందుకంటే ఆ లింక్ ద్వారా మీ వ్యక్తిగత సమాచారం మొత్తం ఆగంతకుల పాలయ్యే ప్రమాదం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలానే వాటిని ఇతరులకు పంపకపోవడం వల్ల మరికొంత మందిని సైబర్ మోసాల బారిన పడకుండా కాపాడినట్లవుతుందని చెబుతున్నారు.
ఒక వేళ మీరు పొరపాటున లింక్‌పై క్లిక్ చేస్తే మీకు డీమార్ట్ సెలబ్రేషన్స్ పేరుతో నకిలీ పేజ్ ఓపెన్ అవుతుంది. దాని యూఆర్‌ఎల్‌ను మీరు గమనిస్తే అది నకిలీదని ఇట్టే తెలిసిపోతుంది. అయితే అందులో ఆకర్షణీమైన ఆఫర్ అంటూ స్పిన్ వీల్ ప్రత్యక్షమవుతుంది. అందులో వివిధ రకాల ఆఫర్లకు సంబంధించిన ఫొటోలు ఉంటాయి. దానిపై క్లిక్ చేస్తే మీరు స్పిన్ వీల్ తిప్పేందుకు మరో అవకాశం అనే దగ్గర వీల్ ఆగినట్లు చూపిస్తూ ఒక మెసేజ్ కనిపిస్తుంది. దాన్ని ఓకే చేసి మరో సారి స్పిన్ చేస్తే మీకు పదివేల రూపాయల విలువైన గిఫ్ట్ వోచర్ గెలుచుకున్నారు అంటూ మెసేజ్ వస్తుంది. మీరు ఎన్నిసార్లు క్లిక్ చేసినా ఇదే విధంగా జరుగుతుంది. తర్వాత గిఫ్ట్ వోచర్ పొందాలంటే ఈ సమాచారాన్ని వాట్సాప్ ద్వారా మీ స్నేహితులకు షేర్ చేయమంటూ మరో మెసేజ్. దాని కింద ఒక బార్ కనిపిస్తుంది. అది బ్లూ రంగులోకి మారే వరకు ఈ మెసేజ్ షేర్ చేయమంటూ మెసేజ్ ఉంటుంది. అలా అని మీరు ఈ సమాచారాన్ని వాట్సాప్‌లో షేర్ చేస్తే మీకు సంబంధించిన వివరాలు మొత్తం హ్యాకర్స్ చేతికి చేరే అవకాశం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.