Free WiFi Railway Station: ప్రయాణికులకు రైల్వే శాఖ బంపర్ ఆఫర్.. చీప్ రేట్లకే ఇంటర్నెట్ డేటా..!

WiFi Railway Station: ప్రయాణీకులకు మెరుగైన, సౌకర్యవంతమైన సేవలను అందించే విషయంలో భారతీయ రైల్వే అప్‌డేటెడ్‌గా ఉంటుంది.

Free WiFi Railway Station: ప్రయాణికులకు రైల్వే శాఖ బంపర్ ఆఫర్.. చీప్ రేట్లకే ఇంటర్నెట్ డేటా..!
Wifi

Updated on: Mar 26, 2022 | 7:26 AM

WiFi Railway Station: ప్రయాణీకులకు మెరుగైన, సౌకర్యవంతమైన సేవలను అందించే విషయంలో భారతీయ రైల్వే అప్‌డేటెడ్‌గా ఉంటుంది. అన్ని రకాల చర్యలను తీసుకుంటుంది. ఇందులో భాగంగానే దేశంలోని మొత్తం 6,100 రైల్వే స్టేషన్లలో ఉచిత హై-స్పీడ్ వై -ఫై సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది ఇండియన్ రైల్వే. ఈ రైల్వే స్టేషన్లను సందర్శించే ప్రయాణికులు ఇప్పుడు ఉచితంగా హై-స్పీడ్ Wi-Fiని పొందవచ్చు అని రైల్వే అధికారులు పేర్కొన్నారు. 22 మార్చి 2022న రాయ్ బరేలీలోని ఉబెర్ని రైల్వే స్టేషన్‌లో Wi-Fi సౌకర్యాన్ని ప్రారంభించారు.

ఎంతసేపు ఉచితం..
Wi-Fi సదుపాయం ఉన్న రైల్వే స్టేషన్‌లకు వచ్చే ప్రయాణికులు ఇకపై అరగంట పాటు ఉచిత హై-స్పీడ్ వై-ఫైని పొందగలుగుతారు. అరగంట పాటు ఉచిత ఇంటర్నెట్‌ని వినియోగించవచ్చు. ఆ తరువాత నామమాత్రపు ధరను చెల్లించి వినియోగించుకోవాల్సి ఉంటుంది. RailTel Wi-Fi సౌకర్యం కోసం నచ్చిన ప్లాన్‌ని ఎంచుకోవచ్చు. రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులకు రైల్‌టెల్ వివిధ రకాల ప్లాన్‌లను అందిస్తుంది.

రైల్‌టెల్ ప్లాన్స్ ఇవే..
1. రూ.10, 34 Mbps స్పీడ్‌తో 5 GB డేటా లభిస్తుంది. వాలిడిటీ ఒక రోజు.
2. రూ. 15, 34 Mbps స్పీడ్‌తో 10 GB డేటా లభిస్తుంది. వాలిడిటీ ఒక రోజు.
3. రూ. 20, 34 Mbps స్పీడ్‌తో 10 GB డేటా లభిస్తుంది. వాలిడిటీ ఐదు రోజులు.
4. రూ. 30, 34 Mbps స్పీడ్‌తో 20 GB డేటా లభిస్తుంది. వాలిడిటీ ఐదు రోజులు.
5. రూ. 40, 34 Mbps స్పీడ్‌తో 20 GB డేటా లభిస్తుంది. వాలిడిటీ పది రోజులు.
6. రూ. 50, 34 Mbps స్పీడ్‌తో 30 GB డేటా లభిస్తుంది. వాలిడిటీ పది రోజులు.
7. రూ. 70, 34 Mbps స్పీడ్‌తో 60 GB డేటా లభిస్తుంది. వాలిడిటీ 30 రోజులు.

రైల్‌టెల్ అందించే ఈ ఇంటర్నెట్ ప్యాక్‌ని రైల్వే స్టేషన్‌లలో కొనుగోలు చేయొచ్చు. అయితే, దీని అసలు ధరతో పాటు ప్రత్యేకంగా GSTని కూడా చెల్లించాల్సి ఉంటుంది. కాగా, రైల్వే స్టేషన్లలో లభించే హై-స్పీడ్ Wi-Fi ధరలు ఇతర ప్లాన్‌ల కంటే చాలా తక్కువ ఉండటం విశేషం.

Also read:

Optical Illusion: మీ కళ్లకు అగ్నిపరీక్ష.. ఈ ఫోటోలో ఎంత మంది ఉన్నారో చెబితే మీరే జీనియస్..!

Viral Video: చేసిందంతా చేసి కుక్కను బలి చేసిన కంత్రీ పిల్లి.. వీడియో చూస్తే అవాక్కవుతారు..!

Astrology: వ్యక్తి ఎత్తును బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చు.. అదెలాగో ఇప్పుడే తెలుసుకోండి..