Viral: అక్కడ మహిళలకు ఉచితంగా కండోమ్స్.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..

ఆ దేశంలోని 18-25 ఏళ్లు వయస్సు ఉన్నవారికి 2023 జనవరి నుంచి ఉచితంగా కండోమ్‌లను ఇవ్వనుంది. వీటిని ఏ ఫార్మసీలలోనైనా తీసుకోవచ్చునని..

Viral: అక్కడ మహిళలకు ఉచితంగా కండోమ్స్.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..
Condoms

Updated on: Dec 12, 2022 | 11:49 AM

ఫ్రాన్స్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. లైంగికంగా సంక్రమించే అంటువ్యాధుల వ్యాప్తిని తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఆ దేశంలోని 18-25 ఏళ్లు వయస్సు ఉన్నవారికి 2023 జనవరి నుంచి ఉచితంగా కండోమ్‌లను ఇవ్వనుంది. వీటిని ఏ ఫార్మసీలలోనైనా తీసుకోవచ్చునని.. ఈ మేరకు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ శుక్రవారం ప్రకటించారు. లైంగిక వ్యాధుల బారిన పడుతున్న వారిలో ఎక్కువగా యువత ఉండటమే ఫ్రెంచ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం అని తెలుస్తోంది.

‘ఈ సంవత్సరం అసాధారణమైన ద్రవ్యోల్బణంతో ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ తరుణంలో అవాంచిత గర్భాధారణ అమ్మాయిలు, మహిళలకు మరింత ఆర్ధిక కష్టాలను తెచ్చిపెట్టే అవకాశం ఉండటంతో వారికి కండోమ్స్‌ను ఉచితంగా అందివ్వనున్నట్లు పేర్కొన్నారు. అయితే పురుషులకు ఇది వర్తించదన్నారు. ఈ అంశాన్ని ఓ వీడియో ద్వారా మాక్రాన్ తెలిపారు. ఈ అంశంలో మైనర్లను ఎందుకు చేర్చలేదని.. అధ్యక్షుడిని ఓ రిపోర్టర్ అడగ్గా.. ‘చాలామంది మైనర్లు సైతం సెక్స్‌లో పాల్గొంటారు. వారు కూడా తమను తాము రక్షించుకోవాలి’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా, 2017లో ఫ్రాన్స్‌కు అధ్యక్షుడిగా ఎన్నికైన మాక్రాన్.. అధికారం చేపట్టిన వెంటనే HIV, ఇతర లైంగికంగా సంక్రమించే వ్యాధుల నిర్ధారణ పరీక్షలు విస్తృతంగా చేయాలని ఆయన ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు.. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే 26 ఏళ్లలోపు మహిళలకు ఉచితంగా లైంగిక వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. అలాగే ఫ్రాన్స్‌లో అబార్షన్‌ ఉచితంగా చేస్తారు. మరోవైపు 2018లో ఫ్రాన్స్ ప్రభుత్వం తీసుకొచ్చిన పధకం ప్రకారం.. పౌరులు ఎవరైనా కూడా కండోమ్స్‌ను ఫార్మసీలో కొనుగోలు చేసినట్లయితే.. వాటికయ్యే ఖర్చును ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది.(Source)