వన్య ప్రాణుల్లో స్పెషలిస్టుగా పేరొందిన ఆ జీవులు కష్టాల్లో చిక్కుకున్నాయి. జిత్తుల మారి తెలివి తేటలతో వనాల్లో తిరుగాడు జంతువులను ముప్పు తిప్పలు పెట్టే నక్కలు ఆపదలో పడ్డాయి. దీంతో అటవీ శాఖ అధికారులు ప్రాణాలకు తెగించి జిత్తుల మారి నక్కలను కాపాడారు.
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం బొమ్మెన, తక్కళ్లపల్లి గ్రామాల శివారులోని వ్యవసాయ బావిలో పడ్డాయి నక్కలు. తొర్తి గంగ నర్సయ్య అనే రైతుకు చెందిన వ్యవసాయ బావిలో రెండు నక్కలు పడిపోయాయి. ఆహారం కోసం వ్యవసాయ భూముల్లోకి వచ్చిన నక్కలు వ్యవసాయ బావిలో జారి పడ్డాయి. వాటి అరుపులు విన్న స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన అధికార యంత్రాంగం అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.
పారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎండీ ముషీర్ అహ్మద్ సిద్దిఖ్, బీట్ ఆఫీసర్ మధుసూదన్ ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. స్థానికుల సహాయంతో వ్యవసాయ బావిలో పడ్డ నక్కలను వలల సహాయంతో బయటకు తీసి కాపాడారు. రెస్క్యూ చేస్తున్న క్రమంలో చీకటి పడడంతో ఉదయం తిరిగి వ్యవసాయ బావి వద్దకు చేరుకున్న అటవీ అధికారుల బృందం వాటిని సేఫ్ గా బయటకు తీయడంలో సక్సెస్ అయ్యారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…