Food Officers Raid: బిర్యానీ పార్సిల్ తీసుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ చూడండి.

|

Apr 07, 2021 | 3:57 PM

ప్రకాశం జిల్లా ఒంగోలులో బిర్యానీ పాయింట్ నిర్వాకం సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. బిర్యానీ కోసం వెళ్లిన కస్టమర్‌కు అక్కడి సిబ్బంది షాకిచ్చారు. ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తి నగరంలోని బిలాల్ బిర్యానీ పాయింట్‌కు వెళ్లారు.

Food Officers Raid: బిర్యానీ పార్సిల్ తీసుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ చూడండి.
Chicken Biryani
Follow us on

Food Officers Raid: ప్రకాశం జిల్లా ఒంగోలులో బిర్యానీ పాయింట్ నిర్వాకం సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. బిర్యానీ కోసం వెళ్లిన కస్టమర్‌కు అక్కడి సిబ్బంది షాకిచ్చారు. ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తి నగరంలోని బిలాల్ బిర్యానీ పాయింట్‌కు వెళ్లారు. ఓ పార్శిల్ ఆర్డర్ చెప్పి అక్కడే నిలబడ్డాడు.. అక్కడ సీన్ చూసి షాక్ తిన్నాడు. బిలాల్‌ బిర్యానీ రెస్టారెంట్‌ను ఇటీవలే ప్రారంభించారు… బిర్యానీ, ఇతర నాన్‌ వెజ్‌ వంటకాలను విక్రయిస్తున్నారు… అయితే, కరోనా సెకండ్ వేవ్ భయం వెంటాడుతున్నా ఒక్కరికీ మాస్క్ లేదు.. బిర్యానీ పార్శిల్ చేసే సిబ్బంది కూడా మాస్కులు ధరించలేదు.

వెంటనే కొందరు యువకులు అక్కడి సిబ్బందిని ప్రశ్నించారు.. మాస్కులు పెట్టుకోవాలని కోరారు. చెమట బిర్యానీలో పడుతోందని చెప్పారు. దీంతో ఆ సిబ్బంది కస్టమర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు… బిర్యానీలో చెమట పడితే ఇంకా రుచిగా ఉంటుందని తలతిక్క సమాధానం చెప్పడంతో బిత్తరపోయిన కస్టమర్‌ ఈ వ్యవహారాన్ని వీడియోతీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు… ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది. అంతేకాదు, బిలాల్‌ బిర్యానీ రెస్టారెంట్‌లో అపరిశుభ్ర వాతావరణంలో ప్యాకింగ్‌ చేయడమే కాకుండా కస్టమర్ల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారంటూ ఫుడ్‌ కంట్రోలర్‌కు వీడియోలు పోస్ట్‌ చేసి ఫిర్యాదు చేశారు. నాన్ వేజ్ పదార్థాలకు నిషేధిత రంగులు వాడుతున్నట్లు తేల్చారు. బయట కౌంటర్లో ఎలాంటి మూతలు లేకుండా పార్శిల్‌ చేస్తుండటంపై నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లో పరిస్థితులను చక్కదిద్దాలని, లేకుంటే లైసెన్స్‌ రద్దు చేస్తామని హెచ్చరించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : Sonu Sood: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న రియల్ హీరో.. సంజీవని వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ప్రారంభించిన సోనూసూద్..

‘శాకుంతలం’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. సమంతకు ఇష్టసఖిగా రానున్న ఆ హీరోయిన్…