Vastu tips: డ్రెస్సింగ్ టేబుల్‌ ఈ దిశలో ఉందా.? దంపతుల మధ్య గొడవలు తప్పవు..

ఇలా ఇంట్లో వాస్తును ప్రభావితం చేసే వస్తువుల్లో డ్రెస్సింగ్ టేబుల్‌ ఒకటి. డ్రెస్సింగ్ టేబుల్‌ను సరైన దిశలో ఏర్పాటు చేసుకోకపోతే దుష్ప్రభావం తప్పదని నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం డ్రెస్సింగ్ టేబుల్‌ ఏ దిశలో ఉంచాలి.? ఏ దిశలో ఉంచకూడదు.? తప్పుడు దిశలో ఉంచితే ఎలాంటి నష్టాలు కలుగుతాయి లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Vastu tips: డ్రెస్సింగ్ టేబుల్‌ ఈ దిశలో ఉందా.? దంపతుల మధ్య గొడవలు తప్పవు..
Vastu Tips

Updated on: Dec 27, 2023 | 7:50 PM

వాస్తు శాస్త్రాన్ని విశ్వసించే వారు మనలో చాలా మంది ఉంటారు. మరీ ముఖ్యంగా భారతీయులను, వాస్తును విడతీసి చూడలేమని ప్రత్యేకంగా చెప్పాల్సి పనిలేదు. అంతలా వాస్తు మన నిత్య జీవితంలో కీలకపాత్ర పోషిస్తుందని విశ్వసిస్తుంటారు. ఇక వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణానికే పరిమితం కాకుండా ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువులు కూడా వాస్తును ప్రభావితం చేస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు.

ఇలా ఇంట్లో వాస్తును ప్రభావితం చేసే వస్తువుల్లో డ్రెస్సింగ్ టేబుల్‌ ఒకటి. డ్రెస్సింగ్ టేబుల్‌ను సరైన దిశలో ఏర్పాటు చేసుకోకపోతే దుష్ప్రభావం తప్పదని నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం డ్రెస్సింగ్ టేబుల్‌ ఏ దిశలో ఉంచాలి.? ఏ దిశలో ఉంచకూడదు.? తప్పుడు దిశలో ఉంచితే ఎలాంటి నష్టాలు కలుగుతాయి లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. బెడ్ రూమ్‌లో ఏర్పాటు చేసుకునే డ్రెస్సింగ్ టేబుల్‌ విషయంలో కచ్చితంగా వాస్తును పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

దంపతులు పడుకునే మంచంలో ఏ కొంచెం కూడా అద్దంలో పడకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇలా ఉండడం వల్ల దుష్ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. అలాగే మంచం ముందు ఎట్టి పరిస్థితుల్లో డ్రెస్సింగ్ టేబుల్‌ అద్దం ఉండకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇలా ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే బెడ్‌రూమ్‌లోని డ్రెస్సింగ్ టేబుల్‌ను ఎప్పుడూ కిటికీ లేదా డోర్‌కు ముందు ఉంచకూడదు. ఇలా ఏర్పాటు చేయడం బయటి నుంచి వచ్చే కాంతి అద్దంలో రిఫ్లెక్ట్‌ అవుతుంది. ఇది నెగిటివిటీని పెంచుతుంది.

ఇక డ్రెస్సింగ్‌ టేబుల్‌ను ఏ దిశలో ఏర్పాటు చేసుకోవాలంటే.. వాస్తు శాస్త్రం ప్రకారం అద్దం నుంచి ఒక రకమైన శక్తి వెలువడుతుంది. అయితే డ్రెస్సింగ్ టేబుల్‌ను ఏర్పాటు చేసిన దిశ ఆధారంగా ఆ శక్తి మనపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో తెలుపుతుంది. వీలైనంత వరకు డ్రెస్సింగ్‌ టేబుల్‌ను గదిలో ఉత్తరం లేదా తూర్పు దిశలో ఏర్పాటు చేసుకోవాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు. అలాగే ఇంట్లో విరిగిన అద్దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..