ఇంట్లో ప్రతీ నిర్మాణంలో వాస్తును పాటించడం సర్వసాధారణమైన విషయం. మరీ ముఖ్యంగా ఇంట్లో బాత్ రూమ్ విషయంలో వాస్తును కచ్చితంగా పాటిస్తుంటారు. పొరపాటున కూడా బాత్‌రూమ్‌లు సరైన వాస్తులో లేకపోతే ఇంట్లో కుటుంబ సభ్యులపై తీవ్ర ప్రభావం పడుతుంది.
ముఖ్యంగా ఇంటికి ఈశాన్య దిశలో బాత్‌రూమ్ ఉంటే విపరీతమైన నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం రోజులు మారాయి, స్థలం తక్కువ ఉండడం. ఇంట్లోనే అటాచ్ బాత్‌రూమ్‌ను నిర్మించుకునే రోజులు వచ్చాయి. అటాచ్ బాత్‌రూమ్ సంస్కృతి పెరిగిన తర్వాత వాస్తును పట్టించుకునే వారు తగ్గిపోయారు. దీంతో ఎలా పడితే అలా అటాచ్ బాత్‌రూమ్‌లను నిర్మిస్తున్నారు. అయితే అటాచ్ బాత్ రూమ్‌ల నిర్మాణంలో దోషాలు ఉంటే.. ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..
* బెడ్ రూమ్‌లో అటాచ్ బాత్‌రూమ్ దంపతుల మధ్య అనుబంధంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. బెడ్ రూమ్‌లో నిద్రించే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కాళ్లు బాత్‌రూమ్ వైపు ఉండకూడదు. ఇలా ఉంటే భార్యా భర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతాయి. దీర్ఘకాలంగా ఈ గొడవలు ఎక్కువై విడాకులకు దారి తీసే ప్రమాదం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ దిశలో పడుకోకూడదని వాస్తు పండితులు సూచిస్తున్నారు.
* ఇక అటాచ్ బాత్‌రూమ్‌లో వల్ల ఇంట్లో ఏవైనా వాస్తు దోషాలు ఉంటే. కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వాస్తు దోషాల నివారణకు.. ఒక గాజు పాత్రలో దొడ్డుప్పు నింపి బాత్‌రూమ్‌లో ఒక మూలన పెట్టాలి. బాత్‌రూమ్ నిర్మాణంలో ఏవైనా వాస్తు దోషాలు ఉంటే ఈ చిట్కాతో చెక్ పెట్టొచ్చు. వారానికి ఒకసారి ఉప్పును మారుస్తూ ఉండాలి. అలాగే బాత్‌రూమ్‌లో టాయిలెట్ సీట్ ఎప్పుడూ మూసి ఉంచాలి. ప్రతికూల శక్తి ఇక్కడి నుంచి బయటికి వస్తుంది. ఫలితంగా ఆర్థిక నష్టాలు చుట్టుముడుతాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..