Optical illusion: కేవలం 5 సెకన్లలో దాగివున్న N అక్షరాన్ని కనిపెట్టండి చూద్దాం..!

|

Feb 10, 2025 | 7:58 PM

మన మెదడు పనితీరును అర్థం చేసుకోవడంలో ఆప్టికల్ ఇల్యూషన్లు కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఇవి కేవలం వినోదాత్మకంగా కాకుండా మన మెదడు సమాచారాన్ని ఎలా ప్రాసెస్ చేస్తుందో తెలియజేస్తాయి. కొన్ని సందర్భాల్లో మన కళ్ల ముందు ఉన్నప్పటికీ ప్రత్యేక అంశాలను గుర్తించడం కష్టమవుతుంది. ఇది మన అవగాహన భావనలపై ఆధారపడుతుంది.

Optical illusion: కేవలం 5 సెకన్లలో దాగివున్న N అక్షరాన్ని కనిపెట్టండి చూద్దాం..!
Optical Illusion
Follow us on

కొంతమంది ఏకక్షణంలో దాగి ఉన్న దాన్ని గుర్తించగలుగుతారు. మరికొందరు కొంత సమయం తీసుకుంటారు. ఇది మెదడులోని సమాచార విశ్లేషణ సామర్థ్యాన్ని సూచిస్తుంది. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం అధిక ఐక్యూ ఉన్న వ్యక్తులు క్లిష్టమైన నమూనాలలో చిన్న మార్పులను కూడా వేగంగా గుర్తించగలరు. వారి మెదడు అనవసరమైన వివరాలను వడపోసి ముఖ్యమైన అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది.

Optical Illusion

ఇప్పుడు మీ దృష్టిని పరీక్షించుకునే సమయం వచ్చింది. ఇవాళ్టి మన ఆప్టికల్ ఇల్యూషన్ లో దాగివున్న N అక్షరాన్ని కనిపెట్టాల్సి ఉంటుంది. కొంచం ఈజీగా ఉంటుంది ప్రయత్నించి చూడండి. కానీ ఈ టాస్క్ కి మీకు లిమిట్ టైమ్ ఉంటుంది. కేవలం 5 సెకన్లలో N అక్షరాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే పాల్గొని కనిపెట్టండి.

మీరు చూస్తున్న ఈ ఇమేజ్ లో అన్ని H అక్షరాలు ఉన్నాయి. ఈ H అక్షరాల మధ్యనే మనకు కావాల్సిన N అక్షరం ఉంది. మీరు 5 సెకన్లలో ఈ అక్షరాన్ని కనిపెట్టండి. దీనికి మీరు మీ బ్రెయిన్ హెల్ప్ తీసుకోండి. వెంటనే బ్రెయిన్ కి మెసేజ్ చేయండి త్వరగా సమాధానం పంపమని. చాలా ఈజీ టాస్క్ కదా దీనికి ఎక్కువ సమయం కూడా తీసుకోవద్దని చెప్పండి.

ఈ ఇమేజ్ ని మొదటి చూసినప్పుడు అన్ని అక్షరాలు ఒకేలా కనిపిస్తాయి. ఈ N అక్షరం కూడా వాటిలో కలిసిపోయినట్లే ఉంటుంది. బాగా ఫోకస్ చేసి చూస్తే తప్ప కనపడదు. మన కళ్లను మోసగించే ఈ భ్రమ కారణంగా అసలు భిన్నమైన అక్షరాన్ని గుర్తించడం కొంచం కష్టతరం అవుతుంది.

తర్వగా కనిపెట్టేందుకు ప్రయత్నించండి. కేవలం మీరు 5 సెకన్లలోనే ఈ అక్షరాన్ని గుర్తించగలగాలి. ఒకవేళ మీరు కనిపెడితే మీ దృష్టి పదునుగా ఉండటమే కాదు, మీరు గొప్ప నిగూఢ విశ్లేషణా నైపుణ్యం కలిగి ఉన్నారని చెప్పవచ్చు. కనిపెట్టని వారు నిరాశ చెందకండి. ప్రతిరోజూ ఇలాంటి ఛాలెంజ్‌లను ప్రయత్నించడం ద్వారా మీ దృష్టి వేగం మెరుగవుతుంది. అంతేకాకుండా చిన్న విషయాలను గమనించే నైపుణ్యం అభివృద్ధి అవుతుంది.

మీరు ఇంకా అక్షరాన్ని గుర్తించలేరా.. అయితే సరే నేనే చెబుతా చూడండి. ఇక్కడే ఉంది దాగివున్న N అక్షరం. నేను మీకోసం వెతికిపెట్టానుగా.