Fevikwik: దేనికైనా క్షణాల్లో అతక్కుపోయే ఫెవిక్విక్.. దాని బాటిల్‌కు ఎందుకు అతుక్కోదో తెలుసా?

సాధారణంగా పెవిక్విక్ లేదా ఫెవికల్ మన చేతికి లేదా వస్తువులకు కొంచెం తగిలినా క్షణాల్లో అది అతుక్కుపోతుంది. ఇలా అన్నింటికి క్షణాల్లో అతుక్కుపోయే ఈ గమ్‌ వాటిని నిల్వ చేసే ప్లాస్టిక్ బాటిల్స్‌కు మాత్రం ఎందుకు అతక్కుకోదనే డౌట్ మీకెప్పుడైనా వచ్చింది. అయితే మీరు కచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిందే.

Fevikwik: దేనికైనా క్షణాల్లో అతక్కుపోయే ఫెవిక్విక్.. దాని బాటిల్‌కు ఎందుకు అతుక్కోదో తెలుసా?
Super Glue Science

Updated on: Jun 01, 2026 | 6:48 PM

ఇనుమైనా, ప్టాస్టికైనా, రబ్బరైనా.. కొన్ని సార్లు మన చేతికి తగిలినా కూడా క్షణాల్లో అతుక్కుపోయే ఫెవిక్విక్ వాటిని నిల్వ చేసే ప్లాస్టిక్ బాటిళ్లకు మాత్రం ఎందుకు అతుక్కోదో మీరెప్పుడైనా ఆలోచించారా? దీని వెనక చిన్న సైన్స్ దాగి ఉంది. సాంకేతిక భాషలో ఈ ఫెవిక్విక్‌ను సైనోఆక్రిలేట్ అని పిలుస్తారు. దీనిని ఇథైల్ సౌనోఆక్రిలేట్ అనే రసాయనాన్ని వాడి తయారు చేస్తారు. ఈ గమ్ దాని పని అది సక్రమంగా చేయాలంటే దానికి కచ్చితంగా తేమ అవసరం.

అయితే ఈ రసాయాన్ని ఫ్యాక్ చేసే ఫెవిక్విక్ బాటిల్‌ను ఎలాంటి తేమ లేకుండా తయారు చేస్తారు. అలా చేసేప్పుడు కొంచెం తేమ ఉన్న అది బాటిల్‌కు అతుక్కుపోతుంది. అందులే తేమ లేకుండా జగ్రత్త పడుతారు. బాటిల్‌ లోపల ఎలాంటి తేమ ఉండదు కాబట్టి గమ్ గట్టిపడకుండా ఎప్పుడూ ద్రవరూపంలోనే ఉంటుంది.

ఇక బాటిల్‌లో ఉన్నంత సేపు ద్రవరూపంగా ఉన్న ఫెవిక్విక్ బాటిల్ నుంచి బయటకు రాగానే గాలిలోని తేమను గ్రహిస్తుంది. దీంతో అది ఏదైనా వస్తువుపై పడిన వెంటనే అందులోని ఉన్న అణువులన్నీ దగ్గరగా చేరి గట్టి గొలుసుకట్టుగా మారే పాలిమరైజేషన్ కెమికల్ రాయాక్షన్ స్టార్ట్ అవుతుంది. దీని వల్ల అప్పటి వరకు ద్రవరూపంలో ఉన్న గమ్ కాస్తా రెప్పపాటులో గట్టి పొరలా మారి వస్తువులను అంటుకునేలా చేస్తుంది.

బాటిల్‌లో గమ్‌ ఎందుకు గట్టిపడదు

  • పైన చెప్పినట్టుగానే బాటిల్‌లో ఈ రసాయనాన్ని నింపేప్పుడు గాలి, తేమ లోపలికి వెళ్లకుండా ప్యాకింగ్ చేస్తారు.
  • అంతే కాకుండా ద్రవరూపంలో ఉన్న రసాయనం గట్టిపడకుండా అందులో ‘స్టెబిలైజర్స్’ కెమికల్ కలుపుతారు
  • ప్రత్యేకంగా రూపొందించిన బాటిల్‌ తయారీలో వాడిన ప్లాస్టిక్‌ ఈ రాయనంతో ఎలాంటి చర్య జరపదు.

మూతకు ఎందుకు అంటుకుంటుంది

అయితే కొన్ని సార్లు ఫెవిక్విక్ వాడి తర్వాత దానికి మళ్లీ క్యాప్ పెట్టినప్పుడు అంది అంటుకుంటుంది. ఇది మీ గమనించే ఉంటారు. దీనికి కారణం ఏంటంటే.. మనం వాడిన తర్వాత బాటిల్ మూతి దగ్గ కాస్త గమ్ మిగిలిపోతుంది. అయితే ఇది గాలిలోని తేమను గ్రహించి అక్కడే గట్టిపడుతుంది. మనం అప్పుడే క్యాప్ పెడతాం కాబట్టి అది దానికి అలాగే అతుక్కుపోతుంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us