Extramarital Affairs: వివాహేతర సంబంధాల్లో మనస్తత్వ శాస్త్రవేత్తలకు సైతం అర్థం కాని కోణాలు

ఇష్టం లేకపోతే విడిపోవచ్చు. ఆ ఆప్షన్‌ ఒకటుంది తెలుసా..! అదేంటో.. కొందరు మనుషులు ఆ ఆప్షన్‌ ఒకటుందనే విషయమే మరిచిపోతున్నారు. బలవంతంగా కలిసి ఉండాల్సిందే అని కోర్టులు కూడా చెప్పడం లేదు కదా. కలిసుండడం సాధ్యం కాదన్నప్పుడు విడాకులు తీసుకుని ఎవరి దారి వాళ్లు చూసుకోండనే అంటున్నాయిగా. కాని.. క్షణికానందాల కోసం క్షణికావేశాలతో.. మరో ఆప్షన్‌ ఎంచుకుంటున్నారు. అండ్‌ ద ఫైనల్‌ రిజల్ట్ ఈజ్.. మర్డర్. క్రూయెల్‌ మర్డర్.

Extramarital Affairs: వివాహేతర సంబంధాల్లో మనస్తత్వ శాస్త్రవేత్తలకు సైతం అర్థం కాని కోణాలు
Extra Marital Affair

Updated on: Mar 24, 2025 | 10:15 PM

‘వివాహేతర సంబంధాలు’ నిజంగా ఓ భారీ సబ్జెక్ట్ ఇప్పుడు. మనస్తత్వ శాస్త్రవేత్తలకు సైతం అర్థం కాని కోణాలెన్నో ఉంటున్నాయి వాటిల్లో. అదే సమయంలో ఈ వివాహేతర సంబంధాల వల్ల జరుగుతున్న హత్యలు పోలీసులకు అతిపెద్ద సవాళ్లు విసురుతున్నాయి. టీవీ ఆన్‌ చేయగానే పర్టిక్యులర్‌గా రెండే వార్తలు కనిపిస్తున్నాయి ఈమధ్య. ఒకటి పొలిటికల్‌ వార్‌ అయితే.. రెండోది వివాహేతర సంబంధాల కారణంగా జరుగుతున్న హత్యలు లేదా హత్యాయత్నాలు. అందులోనూ.. కట్టుకున్న వ్యక్తిని వదిలించుకోవడం కోసం చేస్తున్న మర్డర్స్‌.. చాలా షాకింగ్‌గా ఉంటున్నాయి. బహుశా.. క్రియేటివ్‌ సినిమా డైరెక్టర్లు సైతం తీయలేని కోణాల్లో హత్యలు చేస్తూ.. సమాజాన్ని హడలెత్తిస్తున్నారు. అసలే.. పెళ్లి, పిల్లలు అనే వ్యవస్థపై క్రేజ్‌ తగ్గిపోతోందీ సొసైటీలో. అలాంటి సమయంలో.. భర్తను భార్య, భార్యను భర్త చంపేయడం, ఆ చంపడం కూడా అత్యంత క్రూరంగా ఉంటుండడం చూశాక.. పెళ్లిపై ఉన్న ఆ కాస్త ఇష్టాన్ని కూడా భయం కమ్మేస్తోంది. మీరట్‌లో నేవీ ఆఫీసర్‌ హత్య.. అంతకు ముందు వరంగల్‌లో డాక్టర్‌ను చంపిన తీరు.. లేటెస్ట్‌గా భర్తను మర్డర్‌ చేయించడానికి ప్రియుడితో కలిసి ఓ భార్య వేసిన స్కెచ్‌.. ఒక్కో స్టోరీ వింటే మతిపోవడం ఖాయం. అంతకు మించి.. వెన్నులో వణుకు పుట్టడం తథ్యం. ఇంతకీ.. సమాజంలో మితిమీరుతున్న ఈ తరహా హత్యలను, వాటి వెనక కనిపిస్తున్న ‘పతి-పత్ని ఔర్‌ వో’ అనే సంబంధాలను ఎలా విశ్లేషించాల్సి ఉంటుంది? మనస్తత్వ శాస్త్రవేత్తలు గానీ, పోలీసులు...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి