Birds House:ఈ ఫోటోలో చూస్తున్నది శివలింగం ఆకారంలో వేలాది మట్టి కుండలతో నిర్మించిన పక్షుల ఇల్లు. పక్షుల బస, ఆహారం కోసం పూర్తి ఏర్పాట్లు ఇందులో ఉన్నాయి. ఎండాకాలం అయినా, వర్షాకాలమైనా.. ఇక్కడ పక్షులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. గుజరాత్ (Gujarat)లోని నవీ సంక్లి గ్రామంలో వేలాది తయారు చేసిన ఈ బర్డ్ హౌస్ (Birds House) పక్షులకు నిలయం మారింది. దీనిని నిర్మించిన వ్యక్తి నాలుగో తరగతి పాస్ అయిన రైతు భగవాన్ జీ భాయ్ (Bhagwanji Bhai). ది బెటర్ ఇండియా నివేదిక ప్రకారం.. 75 ఏళ్ల భగవాన్‌జీ భాయ్‌కి పక్షులంటే చాలా ఇష్టం. పక్షులకు ఆహారం పెట్టినప్పుడు, ధాన్యం తిని పక్షులు (Birds) ఎగిరిపోతుంటే, వానలో ఎక్కడ బతుకుతాయోనని దిగులు పడ్డాడు పడేవాడు.
అతను ఎంతో ఖర్చుతో 140 అడుగుల పొడవు, 40 అడుగుల ఎత్తులో ఒక బర్డ్ హౌస్ను నిర్మించాడు. ఇందులో దాదాపు 2500 చిన్న, పెద్ద కుండలను ఉపయోగించారు. అతను నిర్మించిన ఈ అందమైన పక్షుల ఇల్లు అతని గ్రామానికి గుర్తింపుగా మారింది. వేసవిలో పక్షులు ఇక్కడ చల్లగా ఉంటాయి. అయితే వర్షంలో కూడా తడవడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
దీన్ని సిద్ధం చేసేందుకు ఏడాది సమయం పట్టగా 20 లక్షల రూపాయలు వెచ్చించినట్లు ఆ రైతు చెబుతున్నాడు. అతని వయసు 75 ఏళ్లు. 100 ఎకరాల పొలాన్ని చూసుకుంటున్న అతను ఆగ్రో కంపెనీ నడుపుతున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ పక్షి గృహంలో పావురాలు, చిలుకలతో సహా అనేక రకాల పక్షులు నివసిస్తాయి. ఈ పక్షుల నివాసం శివలింగం ఆకారంలో ఉంటుంది. గతంలో భగవాన్‌జీ భాయ్ గ్రామంలో శివాలయాన్ని కూడా నిర్మించారు. భగవాన్‌జీ భాయి నిర్మించిన పక్షుల గృహాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు.
ఇవి కూడా చదవండి: