శిక్షణ పొందిన జంతువులు ట్రెనర్స్ చెప్పినట్లు నడుచుకుంటుంటాయి. అందుకే కుక్కలు, గుర్రాలు, ఏనుగులు మరింత బాగా పనిచేస్తుంటాయి. మనం ఏం చెప్పినా ఇట్టే పట్టేస్తుంటాయి. అయితే, కొన్ని సోమరితనంతో ఉన్న ఏనుగులు వాటి చేష్ఠలతో మనకు నవ్వు తెప్పిస్తుంటాయి. అలాంటి ఓ ఏనుగు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కెన్యాలోని ఓ అనాధ శిబిరంలో ఉండే ఏనుగు నీరు తాగేందుకు కూడా సోమరితనం ప్రదర్శిస్తోంది. ఆ ఏనుగు ఓ నీటి పైపును తొండంతో లేపి నోట్లో పెట్టుకుని నీళ్లు తాగుతోంది. కనీసం పైపును తొండంతో పట్టుకోవడానికి కూడా ఆ ఏనుగుకు బద్ధకంగా అనిపిస్తున్నట్టుంది. కింద పడుతున్న ప్రతిసారీ పైపును తొండంతో నోట్లోకి పెట్టుకుంటోంది. ఈ సోమరిపోతు ఏనుగు వీడియోను షెల్డ్రిక్ వైల్డ్‌లైఫ్ వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, వ్యూస్, లైకులు లక్షల్లో వచ్చి చేరుతున్నాయి.
కాగా, వీడియో చూసిన నెటిజన్లు ఏనుగు బద్ధకానికి తెగ నవ్వుకుంటున్నారు. మరెంతో మంది రీ-ట్వీట్ చేస్తున్నారు. సరదాగా కామెంట్లు పెడుతున్నారు.. ”వావ్ వాటే లేజీ ఎలీఫెంట్”..అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే.. ”లేజీ ఎలీఫెంట్ కాదు.. ఇంటెలీజెంట్ ఎలీఫెంట్”..అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
Also Read:
ఈ ఆహార పదార్ధాలను పెరుగుతో పాటు అస్సలు తినకూడదు.! చాలా డేంజర్.. అవేంటంటే..
దట్టమైన అడవిలో ఊగుతూ కనిపించిన మర్మమైన బొమ్మ.. గగుర్పొడిచే దృశ్యం.. చివరికి ట్విస్ట్ ఏంటంటే.?
Rescued orphan Lemeki is taking the lazy (read: sensible) approach to drinking. She is an orphan in our care that was saved from a raging river. To see her now, with her stubby tusks poking through, is a reminder of how far she’s come: https://t.co/41gbnvwpt9 pic.twitter.com/NesFpe0Wkp
— Sheldrick Wildlife (@SheldrickTrust) June 2, 2021