భార్య పర్మిషన్ లేకున్నా మందు తాగుతున్నారా.. జోక్ కాదు బాస్.. ఈ చట్టం గురించి తెలిస్తే షాకే..

మీ భార్య అనుమతి లేకుండా మద్యం సేవించడం మామూలే అనుకుంటున్నారా..? అయితే మీరు చేస్తున్నది పొరపాటే.. అది మీ వ్యక్తిగత అలవాటు కావొచ్చు కానీ అది మిమ్మల్ని నేరుగా పోలీస్ స్టేషన్‌కు, కోర్టు మెట్లు ఎక్కేలా చేయొచ్చు. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లోని కఠిన చట్టాల గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ విషయాలు తెలుసుకుందాం.

భార్య పర్మిషన్ లేకున్నా మందు తాగుతున్నారా.. జోక్ కాదు బాస్.. ఈ చట్టం గురించి తెలిస్తే షాకే..
Drinking Alcohol Without Wife Consent

Updated on: Jan 23, 2026 | 8:17 AM

భార్యకు తెలియకుండా మందు కొట్టడం లేదా భార్య పర్మిషన్ లేదని సీక్రెట్‌గా తాగడం అనేది సాధారణంగా అందరూ చేస్తుంటారు. కానీ చట్టం దృష్టిలో ఇది సరదా విషయం కాదు. కొన్ని పరిస్థితుల్లో భార్య అనుమతి లేకుండా మద్యం సేవించడం, ఆపై చేసే గొడవలు మిమ్మల్ని నేరుగా కటకటాల వెనక్కి నెట్టవచ్చు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో మద్యం సేవించడం నేరం కాకపోవచ్చు. ముఖ్యంగా గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఈ నియమాలు మరింత కఠినంగా ఉన్నాయి. కానీ 1949 గుజరాత్ మద్యపాన నిషేధ చట్టం ప్రకారం అక్కడ మద్యం సేవించడం, అమ్మడం లేదా దగ్గర ఉంచుకోవడం శిక్షార్హమైన నేరం. అక్కడ భార్య అనుమతి ఉన్నా లేకపోయినా మద్యం తాగి పట్టుబడితే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది.

గృహ హింస చట్టం – 2005 ఏం చెబుతోంది?

మద్యం సేవించిన తర్వాత భర్త ప్రవర్తన మారినా, భార్యను శారీరకగా లేదా మానసికగా వేధించినా అది గృహ హింస చట్టం పరిధిలోకి వస్తుంది. కేవలం కొట్టడమే కాదు, బూతులు తిట్టడం లేదా ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వకపోవడం కూడా నేరమే. ఈ చట్టం కింద భార్య ఫిర్యాదు చేస్తే భర్తపై కఠిన చర్యలు తీసుకుంటారు.

సెక్షన్ 498A: క్రూరత్వం కింద కేసులు

మద్యం మత్తులో భార్యపై క్రూరంగా ప్రవర్తిస్తే ఐపీసీ సెక్షన్ 498A కింద కేసు నమోదయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో కోర్టులు నిందితుడికి భారీ జరిమానాలు విధించడమే కాకుండా కొన్నిసార్లు తన స్వంత ఇంట్లోకి ప్రవేశించకుండా కూడా నిషేధం విధించవచ్చు.

ఆర్థిక నష్టానికి భర్తదే బాధ్యత

ఒక వ్యక్తి మద్యానికి బానిసై సంపాదన అంతా తగలేస్తుంటే, భార్య కోర్టును ఆశ్రయించవచ్చు. భర్త ఖర్చులను నియంత్రించాలని, భార్యాపిల్లలకు భరణం చెల్లించాలని లేదా డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్‌లో చేరి చికిత్స తీసుకోవాలని కోర్టు షరతులు విధించవచ్చు.

తాగడం నా వ్యక్తిగత విషయం అని చాలామంది అనుకుంటారు. కానీ ఆ అలవాటు వల్ల కుటుంబ శాంతికి భంగం కలిగినా, భార్య హక్కులకు భంగం వాటిల్లినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అందుకే మద్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం, కుటుంబాన్ని గౌరవించడం తప్పనిసరి.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..