Relationship Tips: ఇద్దరు వ్యక్తులతో ఒకేసారి డేటింగ్‌లో ఉన్నారా.. అయితే ఆ తర్వాత ఏమవుతుందో.. ఏం చేయాలో తెలుసా..

Double Dating: సంతోషకరమైన, ఆరోగ్యకరమైన రిలేషన్‌షిప్ కావాలని అందరూ అనుకుంటారు. కానీ ఎవరైతే తమని మంచిగా చూసుకుంటారో.. ఎవరితో డేటింగ్ చేస్తే తమ జీవితం రంగులమయం అవుతుందో తెలుసుకోవడం అందరికీ సులభం కాకపోవచ్చు.

Relationship Tips: ఇద్దరు వ్యక్తులతో ఒకేసారి డేటింగ్‌లో ఉన్నారా.. అయితే ఆ తర్వాత ఏమవుతుందో.. ఏం చేయాలో తెలుసా..
Dating 2 People

Updated on: Sep 06, 2022 | 5:04 PM

సంతోషకరమైన, ఆరోగ్యకరమైన సంబంధాలు కావాలని అందరూ అనుకుంటారు. కానీ ఎవరైతే తమని మంచిగా చూసుకుంటారో.. ఎవరితో డేటింగ్ చేస్తే తమ జీవితం రంగులమయం అవుతుందో తెలుసుకోవడం అందరికీ సులభం కాకపోవచ్చు. డబుల్ డేటింగ్ మంచిగా అనిపిస్తుంది కానీ వాస్తవానికి అది పెద్ద సమస్యగా మారుతుంది. మీరు దీన్ని ప్రేమ అని పిలవవచ్చు.. కానీ ఇది ఒక గేమ్ లాగా ఉంటుంది. అవును, డబుల్ డేటింగ్‌లో వ్యక్తులు ఒకే సమయంలో ఇద్దరు వేర్వేరు వ్యక్తులతో డేటింగ్ చేస్తున్నారు. కానీ అలాంటివి మీ సంబంధాన్ని చెడగొట్టడమే కాకుండా మీ వ్యక్తిత్వాన్ని కూడా చాలా చెడుగా ప్రభావితం చేస్తాయి. ఈ రకమైన రిలేషన్ షిప్‌లో ఉన్న ఈ సమయంలో మీరు మీ సమయాన్ని వృధా చేసుకోవడమే కాకుండా మీ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక పోతున్నారు. డబుల్ డేటింగ్‌తో వచ్చే సమస్యల గురించి తెలుసుకుందాం..

డబుల్ డేటింగ్‌తో సమస్యలు..

డబుల్ డేటింగ్‌లో ఎమోషనల్ డ్రామా..

డబుల్ డేటింగ్‌లో డ్రామా, ట్రస్ట్ వంటి చిక్కులు ఉంటాయి. అదే డబుల్ డేటింగ్‌లో మీ భాగస్వాములిద్దరూ మీ గురించి తెలుసుకుంటే.. అది పెద్ద సమస్యగా మారుతుంది. ఇలాంటి సమయంలో చిక్కులను ఫేస్ చేయాల్సి ఉంటుంది. చిక్కులతోపాటు మీరు మానసికంగా కుంగిపోతారు. మీరు కూడా డబుల్ డేటింగ్ చేస్తుంటే చాలా జాగ్రత్తగా ఉండండి.

ఎల్లప్పుడూ  గందరగోళంగా..

ఇలా డబుల్ డేటింగ్ చేసే వారు ఎల్లప్పుడూ గందరగోళంగా ఉంటారు. వారికి ఏది ఒప్పు, ఏది తప్పు అని సమస్య వచ్చేవరకు అర్థం కాదు. మరోవైపు, డబుల్ డేటింగ్‌లో అలానే కొనసాగిస్తే చివరికి చివరికి  పెద్ద సమస్యల్లో ఇరుక్కుపోతారు. అవును డబుల్ డేటింగ్‌లో ముగింపు చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యకు దూరంగా ఉండండి.

ఇద్దరిని అసంతృప్తికి గురిచేస్తారు.. 

డబుల్ డేటింగ్‌లో ఉన్నప్పుడు మీరు మంచి అనుభూతితోపాటు చాలా ఎంజాయ్ చేస్తారు. కానీ ఓ రోజు దొరికిపోతారు. అదే రోజు చిక్కుకుపోతారనేది మాతం 100 శాతం నిజం.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్..