Vastu Tips: ఇంటి ఉత్తర దిశలో ఈ తప్పులు చేస్తున్నారా.? ఇబ్బందులు తప్పవు..

|

May 26, 2024 | 12:29 PM

ఇంటి వాస్తు విషయంలో ఉత్తర దిశకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఉత్తర దిశలో వాస్తు దోషాలు ఉంటే ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే ఇంట్లో కుటుంబసభ్యుల మధ్య సత్సంబంధాలు కూడా ఉండవని వాస్తు పండితులు చెబుతున్నారు. అందుకే ఈ దిశలో వాస్తు నియమాలు పాటిస్తే.. ఇంట్లో సంపద పెరుగుతుంది. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు..

Vastu Tips: ఇంటి ఉత్తర దిశలో ఈ తప్పులు చేస్తున్నారా.? ఇబ్బందులు తప్పవు..
Vastu Tips
Follow us on

భారతీయులు వాస్తును కచ్చితంగా పాటిస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంటి నిర్మాణం విషయంలోనే కాకుండా ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలో కూడా వాస్తును పాటించాలని వాస్తు పండితులు సూచిస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మనకు తెలిసో, తెలియకో చేసే కొన్ని వాస్తు తప్పులు భారీ మూల్యాన్ని చెల్లించడానికి కారణమవుతుంటాయని వాస్తు పండితులు చెబుతుంటారు. అలాంటి కొన్ని వాస్తు నియమాల్లో ఒకదాని గురించి ఈరోజు తెలుసుకుందాం.

ఇంటి వాస్తు విషయంలో ఉత్తర దిశకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఉత్తర దిశలో వాస్తు దోషాలు ఉంటే ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే ఇంట్లో కుటుంబసభ్యుల మధ్య సత్సంబంధాలు కూడా ఉండవని వాస్తు పండితులు చెబుతున్నారు. అందుకే ఈ దిశలో వాస్తు నియమాలు పాటిస్తే.. ఇంట్లో సంపద పెరుగుతుంది. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండాలంటే ఉత్తర దిశలో కొన్ని వాస్తు నియమాలను పాటించాలని వాస్తు పండితులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఇంటిలోకి ఎల్లప్పుడూ ఉత్తర దిశ నుంచే వెళ్లేలా చూసుకోవాలి. ఇంటికి ప్రధాన ద్వారా ఉత్తర దిశలో ఉండాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాగే ఉత్తర దిశలో గోడ లేకుండా ఉంటే మరీ మంచిది.

* ఉత్తర దిశ ఎల్లప్పుడూ తెరిచి ఉండాలి. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటి ఉత్తర దిక్కు ఖాళీగా ఉంటే, ఇల్లు ఆనందం, శ్రేయస్సుతో నిండి ఉంటుందని వాస్తు పండితులు చెబుతుంటారు.

* ఇంటికి ప్రధాన ద్వారా ఉత్తర దిశలో ఉండాలని చెబుతున్నారు. అలాగే ఉత్తర దిశలో అద్ధం ఏర్పాటు చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అలాగే, ఇంటికి ఉత్తర దిశలో మనీ ప్లాంట్ ఉండటం వల్ల ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయని అంటున్నారు.

* ఇక ఉత్తర దిశలో ఉండే వాస్తు దోషాలు తొలగిపోవాలంటే.. కుబేరుడి విగ్రహాన్ని ఇంటికి ఉత్తరం వైపు ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఉద్యోగ అన్వేషణలో ఉన్న వారు శుభవార్త వింటారు.

* ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతుంటే ఇంటికి ఉత్తర దిశలో తులసి మొక్కను ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో శాంతి, సంతోషాలు నెలకొంటాయని పండితులు చెబుతుంటారు.

* ఇక ఇంట్లో ఉత్తరం వైపు గోడలకు బ్లూ కలర్ పెయింట్ వేసుకుంటే సంపాదన పెరుగుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..