Vastu Mistakes: ఇంట్లో గొడవలకు ఈ వాస్తు తప్పులే కారణం.. వెంటనే చెక్ చేసుకోండి..

|

Jul 02, 2024 | 5:20 PM

అయితే వాస్తు లోపాల కారణంగా సమస్యలు తప్పవని వాస్తు పండితులు చెబుతూనే ఉంటారు. వాస్తు లోపాల కారణంగా శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలు కూడా తప్పవని పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా వాస్తు లోపాల కారణంగా కుటుంబ సభ్యుల మధ్య నిత్యం గొడవలు, భార్యభర్తల మధ్య సక్యత లేకపోవడం, చిటికి మాటికి ఏదో ఒక గిల్లికజ్జాలు ఉండడం...

Vastu Mistakes: ఇంట్లో గొడవలకు ఈ వాస్తు తప్పులే కారణం.. వెంటనే చెక్ చేసుకోండి..
Vastu Mistakes
Follow us on

మనలో చాలా మంది వాస్తును విశ్వసిస్తుంటారు. వాస్తుకు అనుగుణంగానే ఇంటి నిర్మాణం ఉండేలా ప్లాన్‌ చేస్తుంటారు. అందుకోసం వాస్తు పండితుల సలహాలు, సూచనలు పాటిస్తుంటారు. ఇంటి పునాది మొదలు, ఇంట్లో గోడలకు వేసుకునే రంగు వరకు ప్రతీ అంశం వాస్తుకు అనుగుణంగానే ఉండాలే చూసుకుంటారు.

అయితే వాస్తు లోపాల కారణంగా సమస్యలు తప్పవని వాస్తు పండితులు చెబుతూనే ఉంటారు. వాస్తు లోపాల కారణంగా శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలు కూడా తప్పవని పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా వాస్తు లోపాల కారణంగా కుటుంబ సభ్యుల మధ్య నిత్యం గొడవలు, భార్యభర్తల మధ్య సక్యత లేకపోవడం, చిటికి మాటికి ఏదో ఒక గిల్లికజ్జాలు ఉండడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. దీనికి ఇంట్లో ఉండే నెగిటివ్‌ ఎనర్జీ కారణమని నిపుణులు చెబుతుంటారు. మరి ఇంట్లో ఇలాంటి సమస్యలు రావడానికి గల వాస్తు లోపాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ పెరగకుండా ఉండాలంటే ఇంటిని కచ్చితంగా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో సాలెపురుగులు గూళ్ళు పెట్టకూడకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు గూళ్లను తొలగించాలి. దీని కారణంగా నెగిటివ్‌ శక్తులు ఆకర్షిమవుతాయి. దీంతో ఇంట్లో ఉండే వారికి అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. అలాగే మనన్శాంతి దూరమై ఏదో తెలియని ఆందోళన వెంటాడుతుతుంది. మూలల్లో ఏర్పడే బజును ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి.

మనలో చాలా మంది అవసరం లేకపోయినా ఇంట్లో న్యూస్‌ పేపర్లను, రసీదులను, ఇతర వస్తువులను అలాగే దాచి పెడుతుంటారు. అయితే ఇది కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటివి ఆర్థికంగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని చెబుతున్నారు. కాబట్టి ఇంట్లో అవసరం లేని వస్తువులను ఎప్పటికప్పుడు తొలగించుకోవడమే మంచిది. పాడైన వస్తువులు ఇంట్లో ఉంటే వ్యవహారాలు ముందుకు సాగవు.

ఇక కొందరు మెట్ల కింద, కిచెన్‌లో సెల్ఫ్‌ పైన కూడా పాడైన వస్తువులను పెడుతుంటారు. ఇది కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలా పెట్టడం వల్ల ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ పెరుగుతుంది. ఇంట్లో వారి మధ్య సత్సంబంధాలు ఉండవు. నిత్యం గొడవలు జరుగుతాయి. కాబట్టి ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు లేకపోతే వెంటనే ఈ జాగ్రత్తలు పాటించి చూడండి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..