ప్రపంచంలో అత్యధికంగా కరెంట్ వినియోగించే దేశం ఏదో తెలుసా?

ఈ రోజుల్లో కరెంట్ లేకుండా ఏ పని చేయలేము. వంటింటి మిక్సీ నుంచి వాషింగ్ మెషీన్‌లో బట్టలు ఉతకడం వరకు అన్నింటికి కరెంట్ అవసరం. కానీ ఏ దేశం అత్యధికంగా కరెంట్ ఉపయోగిస్తుందో మీకు తెలుసా? తెలియకపోతే ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ప్రపంచంలో అత్యధికంగా కరెంట్ వినియోగించే దేశం ఏదో తెలుసా?
Electricity Consume Country

Updated on: Jul 24, 2025 | 9:16 PM

విద్యుత్తు నిస్సందేహంగా మనిషి కనిపెట్టిన గొప్ప ఆవిష్కరణలలో ఒకటి. కొద్దిసేపు కరెంట్ పోయినా అంతా ఆగమాగం అవుతుంది. కరెంట్ లేకుండా కంపెనీల నుంచి మొదలు ఇంటి పని దాకా ఏది సరిగ్గా అవ్వదు. అందువల్ల రోజువారీ జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉండే విద్యుత్తును వృధా చేయకుండా ఉపయోగించడం కూడా అంతే ముఖ్యం. కానీ ప్రపంచంలో ఏ దేశం ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తుందో మీకు తెలుసా? ఈ ఆసక్తికరమైన విషయాన్ని ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కరెంట్ వినియోగంలో ఏ దేశం టాప్..?

స్టాటిస్టా నివేదిక ప్రకారం.. ప్రపంచం ఏటా 21,776 బిలియన్ కిలోవాట్ గంటల కంటే ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశాలు అత్యధిక విద్యుత్తును వినియోగిస్తాయి. అనేక కారణాల వల్ల ప్రపంచంలో విద్యుత్తు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. వాణిజ్య, నివాస స్థలాల విస్తరణ, ఎయిర్ కండిషనర్లు, ఇతర గృహోపకరణాల వాడకం పెరుగుదల, పరిశ్రమల నుండి పెరుగుతున్న డిమాండ్ వల్ల విద్యుత్ వినియోగం పెరుగుతుంది.

చైనా ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్ వినియోగదారు. ఇది 8,000 టెరావాట్ గంటల కంటే ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. రెండవ స్థానంలో అమెరికా ఉంది. 4,000 టెరావాట్ గంటలకు పైగా వినియోగిస్తుంది. భారత్ 1392 టెరావాట్ గంటలతో మూడవ స్థానంలో ఉంది.

అత్యధిక కరెంట్ వినియోగించే దేశాల జాబితా:

చైనా,అమెరికా, భారత్, జపాన్, బ్రెజిల్, కెనడా, దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్, సౌదీ అరేబియా, ఇరాన్

తక్కువ వినియోగించే దేశాలు

ఆఫ్రికన్ దేశాలైన చాడ్, సోమాలియా, సియెర్రా లియోన్, మధ్య ఆఫ్రికా దేశాలు అతి తక్కువ విద్యుత్తును వినియోగిస్తున్నాయి. మరో విషయం ఏమిటంటే.. ఈ దేశాలలోని చాలా ప్రాంతాలకు విద్యుత్ కనెక్షన్ అస్సలు లేదు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..