Dreams: కలలో చేపలు కనిపించాయా.? దాని అర్థం ఏంటంటే..

మనం పడుకున్న సమయంలో కలలు రావడం సర్వసాధారణమైన విషయం. కలలు రాని వారి వారు ఉండరనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కలలో మనకు కనిపించే అంశాలు మన నిజ జీవితంపై ప్రభావం చూపుతాయని చాలా మంది విశ్వసిస్తారు. కలల శాస్త్రంలో కూడా వీటికి సంబంధించి ఎన్నో విషయాలను సైతం ప్రస్తావించారు....

Dreams: కలలో చేపలు కనిపించాయా.? దాని అర్థం ఏంటంటే..
Fish In Dream

Updated on: Apr 21, 2024 | 10:40 AM

మనం పడుకున్న సమయంలో కలలు రావడం సర్వసాధారణమైన విషయం. కలలు రాని వారి వారు ఉండరనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కలలో మనకు కనిపించే అంశాలు మన నిజ జీవితంపై ప్రభావం చూపుతాయని చాలా మంది విశ్వసిస్తారు. కలల శాస్త్రంలో కూడా వీటికి సంబంధించి ఎన్నో విషయాలను సైతం ప్రస్తావించారు. ప్రాంతం, మతంతో సంబంధం లేకుండా ఈ కలల శాస్త్రాన్ని విశ్వసిస్తుంటారు. మరి కలలో మనకు కనిపించే కొన్ని దృశ్యాలు, వాటి వల్ల జరగబోయే పరిణామాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* మనలో చాలా మందికి పడుకున్న సమయంలో కలలో చేపలు కనిపిస్తాయి. ఇలా కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. తర్వలోనే మీరు ఏదో శుభవార్త వింటారని పండితులు చెబుతున్నారు.

* ఇక లక్ష్మీదేవీ కలలో కనిపిస్తే రానున్న రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అర్థం చేసుకోవాలి. ఏదో ఊహించని ధన లాభం పొందే అవకాశం ఉందని అర్థం.

* గుడ్లగూబ అనగానే మనలో చాలా మంది భయపడతారు. అయితే కలలో గుడ్లగూబ కనిపించడం మంచి సంకేతమని పండితులు చెబుతున్నారు. కలలో గుడ్లగూబ కనిపిస్తే త్వరలోనే మీరు విజయం సాధిస్తారని అర్థం.

* కలలో వినాయకుడు కనిపిస్తే ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని అర్థం చేసుకోవచ్చు. మీరు చేపట్టిన పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి.

* పువ్వులు కలలో కనిపిస్తే మంచి ఆరోగ్యం మీ సొంతమవుతుందని అర్థం. అప్పటి వరకు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఉంటే వాటికి పరిష్కారం లభించనుందని అర్థం చేసుకోవాలి.

* కలలో కాళ్లు, చేతులు కడుగుతున్నట్లు కనిపిస్తే.. జీవితంలో ఉన్న దుఃఖాలు, సమస్యలు తొలగిపోనున్నాయని అర్థం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు.

* చనిపోయిన మీ పూర్వీకులు కలలో మిమ్మల్ని దీవిస్తున్నట్లు కనిపిస్తే మీకు సమాజంలో గౌరవప్రతిష్టలు పెరుగుతాయని అర్థం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు.

* ఒకవేళ కుక్క మిమ్మల్ని కరుస్తున్నట్లు కలలో కనిపిస్తే త్వరలోనే మీకు కష్టాలు ప్రారంభంకానున్నాయని అర్థం చేసుకోవచ్చు. ఏదో విషయంలో అపాయం పొంచి ఉన్నట్లు భావించాలి.

* కలలో కాలు జారి పడినట్లు కనిపిస్తే మీకు కష్టాలు ఎదురుకాబోతున్నాయని అర్థం చేసుకోవాలి. ఏదో విషయంలో భారీ నష్టం పొంచి ఉన్నట్లు అర్థం.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు పండితులు, స్వప్నశాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. ఇందులో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గుర్తించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..