Rain: వర్షం పడేప్పుడు కరెంట్‌ ఎందుకు తీస్తారో తెలుసా.? అసలు కారణం ఏంటంటే..

|

Aug 21, 2024 | 9:47 AM

సాధారణంగా ట్రాన్స్‌ ఫార్మర్‌లో హై వోల్టేజ్‌ పవర్‌ స్టోర్ అయి ఉంటుంది. వర్షాలు కురిసే సమయంలో ట్రాన్స్‌ ఫార్మర్‌లకు దగ్గరల్లో ఉండే చెట్ట కొమ్మలు విరిగిపడడం, గాలికి ఏవైనా వస్తువులు బలంగా ఢీకొట్టడం వల్ల ట్రాన్స్‌ ఫార్మర్‌లు డ్యామేజ్‌ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్బాల్లో ట్రాన్స్‌ ఫార్మర్‌లు పేలిపోయే అవకాశాలు కూడా ఉంటాయి...

Rain: వర్షం పడేప్పుడు కరెంట్‌ ఎందుకు తీస్తారో తెలుసా.? అసలు కారణం ఏంటంటే..
Power Cut
Follow us on

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఉదయమంతా ఎండ ఉంటున్నా సాయంత్రం కాగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది. ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తోంది. ఇక వర్షం పడగానే ముందుగా ఠక్కున కరెంట్ పోతుంది. అసలే వర్షం అందులోనూ కరెంట్ లేకపోతే ఇబ్బంది ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే వర్షం పడితే కరెంట్ ఎందుకు తీసేస్తారో అనే సందేహం మనలో చాలా మందికి వచ్చే ఉంటుంది. ఇంతకీ వర్షం కురిసే సమయంలో కరెంట్ ఎందుకు తీసేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా ట్రాన్స్‌ ఫార్మర్‌లో హై వోల్టేజ్‌ పవర్‌ స్టోర్ అయి ఉంటుంది. వర్షాలు కురిసే సమయంలో ట్రాన్స్‌ ఫార్మర్‌లకు దగ్గరల్లో ఉండే చెట్ట కొమ్మలు విరిగిపడడం, గాలికి ఏవైనా వస్తువులు బలంగా ఢీకొట్టడం వల్ల ట్రాన్స్‌ ఫార్మర్‌లు డ్యామేజ్‌ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్బాల్లో ట్రాన్స్‌ ఫార్మర్‌లు పేలిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే వర్షం మొదలు కాగానే కరెంట్ తీసి వేయడానికి ప్రధాన కారణం ఇదే.

ఇక భారీ వర్షాల కారణంగా వైర్లు తెగి పడుతుంటాయి. దీంతో రోడ్లపై నిలిచిపోయిన నీళ్లలో వైర్లు తెగి పడడం వల్ల అటుగా వెళ్లే వారికి షాక్‌ కొట్టే అవకాశాలు ఉంటాయి. అందుకే ఒకవేళ ఏవైనా వైర్లు తెగిపడతాయేమో అన్న కారణంతో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు. అలాగే వర్షాలు కురిసే సమయంలో పిడుగులు, మెరుపులు రావడం సర్వసాధారణమైన విషయం. వీటి కారణంగా వైర్లలో విద్యుత్ ప్రవాహ ఒక్కసారిగా పెరుగుతుంది. ఈ కారణంగా ట్రాన్స్‌ ఫార్మర్‌లు పెలే అవకాశం ఉంటుంది.

అదే విధంగా ఇల్లలోకి కూడా కరెంట్‌ తీవ్రత ఒక్కసారిగా పెరుగుతుంది. పిడుగులు పడే సమయంలో ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లు పాడవ్వడానికి కారణం ఇదే. ఒక గాలి కారణంగా వైర్లు ఒకదానితో మరొకటి తగిలే అవకాశాలు ఉంటాయి. ఇదివో ఇవన్నీ కారణాల కారణంగానే వర్షం పడే సమయంలో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..