
నిద్రలో కలలు రావడం సర్వసాధారణమైన విషయం. మనలో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమయంలో కలలు వస్తూనే ఉంటాయి. అయితే కలలో రకరకాల అంశాలు కనిపిస్తుంటాయి. వీటిలో కొన్ని మనకు సంతోషాన్ని కలిగిస్తే, మరికొన్ని మాత్రం భయపెడుతుంటాయి. అయితే మనకు నచ్చని కలలన్నీ మంచివి కావని, నచ్చే కలలన్నీ మంచికి సంకేతం కావని పండితులు చెబుతుంటారు.
మనకు వచ్చే ప్రతీ కలకు ఒక అర్థం ఉంటుందని స్వప్నశాస్త్రంలో కూడా ప్రస్తావించారు. డ్రీమ్ సైన్స్ ప్రకారం ప్రతీ కలకు ఒక అర్థం ఉంటుంది. మానసిక నిపుణులు సైతం మనకు వచ్చే కలలకు అర్థం ఉంటుందని చెబుతున్నారు. మన జీవితంలో జరిగే అంశాలకు, మనకు వచ్చే కలలకు మధ్య సంబంధం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరి కలలో దెయ్యం కనిపిస్తే ఎలాంటి అర్థమో ఇప్పుడు తెలుసుకుందాం..
కలలో దెయ్యం కనిపిస్తే అలర్ట్ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. దెయ్యం కనిపించడం ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండనుందని అర్థం చేసుకోవాలి. మీరు అనుకోకుండా డబ్బు కోల్పోయే అవకాశాలు ఉంటాయని అర్థం చేసుకోవాలని చెబుతున్నారు. ఇక ఒకవేళ కలలో దెయ్యం కనిపిస్తే ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఆరోగ్య సంబంధత సమస్యలు వచ్చే అవకాశం ఉననట్లు అర్థం చేసుకోవాలి.
అయితే ఒకవేళ కలలో మీరు దెయ్యంతో పోరాడినట్లు కనిపిస్తే మాత్రం అది మంచి సంకేతంగా చెప్పొచ్చని నిపుణులు అంటున్నారు. జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోనున్నాయని, మీకు త్వరలోనే మంచి రోజులు రానున్నాయని అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు ఉన్న కష్టాలన్నీ తీరిపోయి, మంచి రోజులు రానున్నాయని అర్థం చేసుకోవాలి. జీవితంలో కష్టాలు తీరుతాయని అర్థం. అయితే కలలో దెయ్యం ఎగురుతున్నట్లు కలలో కనిపిస్తే మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మీ శత్రువుల నుంచి మీకు హాని జరిగే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..