Fridge Cleaning Tips: మీ ఇంట్లోని రిఫ్రిజిరేటర్‌ ఎప్పుడూ ఫ్రెష్‌గా, తాజాగా ఉండాలంటే.. ఇలా చేయండి.. ఎక్కువరోజులు పనిచేస్తుంది..

|

Mar 11, 2024 | 8:22 AM

అయితే దీని నిర్వహణపై ప్రజల్లో అంతగా అవగాహన లేదు. దీని వల్ల చాలా మందికి ఫ్రిజ్ పరిశుభ్రతను కాపాడుకోవడం కష్టంగా మారింది. ఫ్రిజ్ కేవలం రెండు-మూడు నిమిషాలు శుభ్రం చేసిన తర్వాత కూడా మురికిగా, దుర్వాసనతో ఉంటే ఇక్కడ పేర్కొన్న చిట్కాలు మీకు సహాయపడవచ్చు. అంతే కాదు ఈ చిట్కాల సహాయంతో మీ ఫ్రిడ్జ్ ఎక్కువ రోజుల పాటు కొత్తగా మెరిసిపోయేలా చేసుకోవచ్చు.

Fridge Cleaning Tips: మీ ఇంట్లోని రిఫ్రిజిరేటర్‌ ఎప్పుడూ ఫ్రెష్‌గా, తాజాగా ఉండాలంటే.. ఇలా చేయండి.. ఎక్కువరోజులు పనిచేస్తుంది..
Fridge Cleaning Tips
Follow us on

Fridge Cleaning Tips: ఈ రోజుల్లో, ఆహారాన్ని తాజాగా ఉంచడానికి దాదాపు ప్రతి ఇంట్లో రిఫ్రిజిరేటర్లను ఉపయోగిస్తున్నారు. వేసవిలో ఫ్రిజ్ వాడకం కూడా ఎక్కువగా ఉంటుంది. రుచికరంగా ఉన్న ఏదైనా ఆహారం మిగిలి పోతే వెంటనే దాన్ని ఫ్రిజ్‌ లో పెట్టేస్తుంటారు. ఆ మర్నాడు తిరిగి వేడి చేసుకు వాడుతుంటారు. అలాగే పాలు, పెరుగు, పూలు, ఒకటేమిటి రకరకాల పదార్ధాలను నిల్వ ఉంచడానికి ఫ్రిజ్‌ ను ఉపయోగించడం సర్వసాధరణం. అయితే దీని నిర్వహణపై ప్రజల్లో అంతగా అవగాహన లేదు. దీని వల్ల చాలా మందికి ఫ్రిజ్ పరిశుభ్రతను కాపాడుకోవడం కష్టంగా మారింది. ఫ్రిజ్ కేవలం రెండు-మూడు నిమిషాలు శుభ్రం చేసిన తర్వాత కూడా మురికిగా, దుర్వాసనతో ఉంటే ఇక్కడ పేర్కొన్న చిట్కాలు మీకు సహాయపడవచ్చు. అంతే కాదు ఈ చిట్కాల సహాయంతో మీ ఫ్రిడ్జ్ ఎక్కువ రోజుల పాటు కొత్తగా మెరిసిపోయేలా చేసుకోవచ్చు.

ఉష్ణోగ్రత సెట్టింగ్:

బ్యాక్టీరియా పెరుగుదలను అరికట్టి, ఆహారం ఎక్కువసేపు తాజాగా ఉండేలా చూసుకోవడానికి, ఎల్లప్పుడూ మీ ఫ్రిజ్ ఉష్ణోగ్రత 35-38 °F (1.6-3.3 °C) మధ్య ఉండేలా చూసుకోండి. ఇది కుళ్లిన ఆహారం వల్ల వచ్చే దుర్వాసన సమస్యను నియంత్రిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఆహార నిల్వ:

మిగిలిపోయిన వాటిని నిల్వ చేయడానికి ఎల్లప్పుడూ గాలి చొరబడని, శుభ్రమైన కంటైనర్లను ఉపయోగించండి. ఇది ఆహారాన్ని తాజాగా ఉంచుతుంది. అలాగే, వాటిని తీసివేసేటప్పుడు లేదా నిల్వచేసేటప్పుడు పడిపోయే ప్రమాదం తక్కువ. ఇది ఫ్రిజ్ మరింత శుభ్రంగా ఉండేలా చేస్తుంది.

చెడు వాసనలను ఇలా తొలగించండి:

దుర్వాసన పోవాలంటే ఫ్రిజ్‌ని ప్రతిరోజూ శుభ్రం చేయాల్సిన అవసరం లేదు. మీరు బేకింగ్ సోడా సహాయంతో దాని వాసనను పోగొట్టుకోవచ్చు. దీని కోసం రిఫ్రిజిరేటర్‌లో బేకింగ్ సోడా ఓపెన్ బాక్స్‌ను ఉంచండి. ప్రతి 3 నెలలకు దాన్ని మార్చండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి