Kerala Lady Delisha Davis Drives a Tanker Lorry:అమ్మాయిలు కదా.. మీకు డ్రైవింగ్ ఎందుకు, అబ్బాయిలు చేసే పనులు మీరెందుకు చేస్తారంటూ.. ఉచిత సలహాలు ఇచ్చే వారికి తన డ్రైవింగ్‌తో పిచ్చెక్కిస్తోంది కేరళకు చెందిన ఓ యువతి. మహిళలు దేనిలో తక్కువ కాదంటూ నిరూపించింది. కల్పనా చావ్లా లాంటి లెజండరీ మహిళలు ఎందరో అంతరిక్షంలోకి ప్రయాణిస్తుంటే.. ఆఫ్‌ట్రాల్ ఈ లారీ డ్రైవింగ్ నేను చేయలేనా అనుకుంది. అంతే, ఇంకేముంది తన కుటుంబసభ్యులను ఒప్పించింది.. డ్రైవింగ్ ఫీల్డ్‌లో అద్భుతంగా రాణిస్తోంది 24ఏళ్ల దెలిషా డేవిస్.
కేరళలోని త్రిసూర్‌కు చెందిన దెలిషా డేవిస్ ఎంకామ్ ఫినిష్ చేసింది. కానీ తనకు డ్రైవింగ్ అంటే ఎంతో ఇష్టం. దెలిషా తండ్రి డేవిస్ లారీ డ్రైవర్ కావడంతో, తనకు ఇష్టమైన డ్రైవింగ్ ఫీల్డ్‌లో అద్భుతంగా రాణించేందుకు మరింత సులువు అయింది ఆమెకు. డేవిస్ కూడా కూతురు కోరికను వద్దనలేదు. ధైర్యంగా లారీ డ్రైవింగ్ నేర్చుకుంటాను నాన్నా.. అని అడిగితే కాదనలేపోయాడు. తన కూతురుకు ఎంతో ఇష్టమైన డ్రైవింగ్ ఫీల్డ్‌లో ప్రోత్సహించాడు డేవిస్. ఇంకేముందు.. వందల కిలోమీటర్లు వంటరిగా ఆయిల్ ట్యాంకర్‌ను నడుపుతూ.. తనకు సరిలేరని నిరూపిస్తుంది దెలిషా.
డ్రైవింగ్ వృత్తిగా చేసుకున్న ఈ కేరళ యువతి దెలిషా డేవిస్ పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్‌గా పనిచేస్తోంది. అలా వారానికి మూడుసార్లు ఓ పెట్రోల్ ట్యాంకరును కొచ్చి నుంచి మళప్పురం వరకు వెళ్లి తిరిగొస్తుంది. అయితే, వీటి మధ్య దూరం 300 కిలోమీటర్లు. ఎలాంటి అలుపు సొలుపు లేకుండా ఆయిల్ ట్యాంకర్‌ను నడుపుతూ, గమ్యానికి చేర్చుతుంది దెలిషా. అయితే, తన తండ్రి ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందని చెబుతుంది దెలిషా.
ఇక, దెలిషా లేడీ లారీ డ్రైవర్‌ను చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. శభాష్ అంటూ తెగ మెచ్చుకుంటున్నారు. ఇక తాజాగా దెలిషాకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందరి మహిళలకు నువ్వే ఓ ఆదర్శమంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.