భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI) దేశంలో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ప్రత్యేక ‘బాల్ ఆధార్’ను జారీ చేస్తుంది. దీనినే ‘బ్లూ ఆధార్ కార్డ్’ అని కూడా అంటారు. వాస్తవానికి పిల్లల ఆధార్ కార్డు కోసం రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, చాలా మంది మోసపూరితంగా డబ్బు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై దేశ వ్యాప్తంగా కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. దాంతో ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న యూఐడీఏఐ.. డబ్బు వసూలు చేసే వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అదే సమయంలో డబ్బులు వసూలు చేసే వారిపై ఎలా ఫిర్యాదు చేయాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి? అనే అంశాలను ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాల మనం తెలుసుకుందాం..
5 సంవత్సరాల లోపు పిల్లలకు తీసుకునే బాల్ ఆధార్ కార్డ్ పూర్తిగా ఉచితం. UIDAI ఇందుకోసం ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదు. అంతేకాదు.. పిల్లల బేస్‌లో బయోమెట్రిక్ గుర్తింపు మార్కులను అప్‌డేట్ చేయడం కూడా పూర్తిగా ఉచితం. అయితే, బాల్ ఆధార్ సమయంలో కొన్ని సేవా సంస్థలు డబ్బులు వసూలు చేస్తున్నాయి. అది తీవ్ర నేరంగా పరిగణిస్తోంది UIDAI. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తే ఫిర్యాదు ఇవ్వాలని, వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తింది UIDAI.
బాల్ ఆధార్‌కు సంబంధించి ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే.. వెంటనే 1947 నంబర్‌కు కల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. లేదా help@uidai.gov.in ఈ -మెయిల్ చేయడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఇలా ఫిర్యాదు చేసిన వెంటనే సదరు సంస్థపై చర్యలు తీసుకుంటుంది UIDAI.
మీరు కూడా మీ పిల్లల బాల్ ఆధార్ కార్డ్ తీసుకోవాలనుకుంటే.. ఈ క్రింది ప్రక్రియను ఫాలో అవ్వొచ్చు.
1. ముందుగా మీరు UIDAI uidai.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
2. ఆ తర్వాత ఆధార్ కార్డ్ రిజిస్ట్రేషన్ ఎంపికపై క్లిక్ చేయాలి.
3. ఆపై మీ పిల్లల పేరు, తల్లిదండ్రుల ఫోన్ నంబర్.. బిడ్డ, అతని తల్లిదండ్రులకు సంబంధించిన ఇతర అవసరమైన బయోమెట్రిక్ సమాచారం, అవసరమైన వివరాలను పూరించాలి.
4. దీని తర్వాత మీరు తప్పనిసరిగా నివాస చిరునామా, రాష్ట్రం మరియు ఇతర వివరాలను పూరించాలి.
5. నమోదు చేసిన అన్ని వివరాలను సరి చూసుకుని, సబ్మిట్ క్లిక్ చేయాలి.
6. ఆ తరువాత అపాయింట్‌మెంట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
7. వినియోగదారుల గురింపు, చిరునామా, పుట్టిన తేదీ, వంటి అవసరమైన దృవీకరణ పత్రాలను ఆధార్ ఎగ్జిక్యూటీవ్ వద్దకు తీసుకెళ్లాలి. వాటిని పరిశీలించి ఆధార్ ఎగ్జిక్యూటీవ్ తదుపరి ప్రాసెసింగ్‌ను పూర్తి చేస్తారు. దరఖాస్తు ప్రక్రియను ట్రాక్ చేయడానికి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు.
8. ఆధార్ కార్డ్ 60 రోజుల లోపు వినియోగదారు నమోదిత చిరునామాకు పోస్టులో చేరుతుంది.
#BaalAadhaar#AadhaarEnrolment & #MandatoryBiometricUpdates are FREE OF COST
UIDAI is strictly against any agency accepting extra money from residents for Aadhaar services.
If you’re asked to pay extra, please call 1947 or email us at help@uidai.gov.in to register your complaint. pic.twitter.com/7QCOgMjbKT— Aadhaar (@UIDAI) December 6, 2022
మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..