Space: అంతరిక్షంలో గర్భం దాల్చిన ఏకైక జీవి.. ఏకంగా 33 పిల్లలకు జన్మనిచ్చిన వైనం

|

Dec 04, 2023 | 6:30 PM

టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిన విశ్వరహస్యాలు మిస్టరీగానే మిగిలిపోతున్నాయి. భూమి పుట్టుక, చంద్రునిపై వాతావరణం, గ్రహాంతరవాసులు నిజంగా ఉన్నారా? వంటి ఎన్నో విషయాలు ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో సైంటిస్టులు ఈ చిక్కుముడిని విప్పడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ఎన్నో పరిశోధనలు చేశారు. కొన్ని సమాధానాలు కనుగొనబడినప్పటికీ, కొన్ని ప్రశ్నలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. అలాంటి ప్రశ్నల్లో ఒకటి అంతరిక్షంలో పునరుత్పత్తి..

Space: అంతరిక్షంలో గర్భం దాల్చిన ఏకైక జీవి.. ఏకంగా 33 పిల్లలకు జన్మనిచ్చిన వైనం
Cockroach In Space
Follow us on

టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిన విశ్వరహస్యాలు మిస్టరీగానే మిగిలిపోతున్నాయి. భూమి పుట్టుక, చంద్రునిపై వాతావరణం, గ్రహాంతరవాసులు నిజంగా ఉన్నారా? వంటి ఎన్నో విషయాలు ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో సైంటిస్టులు ఈ చిక్కుముడిని విప్పడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ఎన్నో పరిశోధనలు చేశారు. కొన్ని సమాధానాలు కనుగొనబడినప్పటికీ, కొన్ని ప్రశ్నలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. అలాంటి ప్రశ్నల్లో ఒకటి అంతరిక్షంలో పునరుత్పత్తి సాధ్యం అవుతుందా? అంతరిక్షంలో జీవించగలమా? అనే దానిపై చేసిన ప్రయోగం చివరకు విజయవంతమైంది. అంతరిక్షంలో ఈ జీవి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 33 మంది పిల్లలకు జన్మనిచ్చింది. అంతరిక్షంలో గర్భందాల్చి, అక్కడే జన్మనిచ్చిన ఏకైక జీవిగా రికార్డు సృష్టించింది.

మనం చర్చిస్తోంది బొద్దింక గురించే. 2007లో రష్యా శాస్త్రవేత్తలు ఫోటాన్-ఎం-బయో ఉపగ్రహం సహాయంతో హోప్ అనే రష్యన్ బొద్దింకను అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. 12 రోజులు అంతరిక్షంలో గడిపిన బొద్దింక 33 పిల్లలకు జన్మనిచ్చింది. ఆసక్తికరంగా.. అన్ని బొద్దింక పిల్లలు పుట్టిన తర్వాత బాగా తినడం, త్రాగడం ప్రారంభించాయి. సాధారణంగా బొద్దింకలు భూమిపై పుట్టిన తర్వాత, వాటి వీపుపై ఓ పారదర్శక షెల్ ఉంటుంది. ఆ తర్వాత కాలక్రమేణా వయసు పెరిగే కొద్దీ బంగారు రంగులోకి మారడం ప్రారంభమవుతుంది. అయితే, అంతరిక్షంలో జన్మించిన బొద్దింకల విషయంలో మాత్రం అలా జరగలేదు. వారి వీపుపై ఉండే కారపేస్ పుట్టుకతో నల్లగా ఉంది. అది కాలక్రమేణా ముదురు రంగులోకి మారడం ప్రారంభించింది.

ఈ మార్పుకు కారణం ఏమిటి?

అంతరిక్షంలో పుట్టిన బొద్దింకల శరీరంలో ఈ ప్రత్యేక మార్పులను శాస్త్రవేత్తలు గమనించారు. దీనిపై వారు పరిశోధన ప్రారంభించారు. వాటి శరీరంలో ఈ మార్పు గురుత్వాకర్షణ వల్ల జరిగిందని తర్వాత గ్రహించారు. అంటే గురుత్వాకర్షణ వల్ల జీవుల శరీరంలో ఈ మార్పు జరిగిందన్నమాట. అంతరిక్షంలో గురుత్వాకర్షణ ఉండదు కాబట్టి, భూమిపై జరిగేవి అంతరిక్షంలో జరగవు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.