Jobs In CISF: సీఐఎస్‌ఎఫ్‌లో 2000 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. ఈ అవకాశం వారికి మాత్రమే.. 

|

Feb 21, 2021 | 5:13 PM

CISF Recruitment 2021 for 2000 Post: సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ - CISF కానిస్టేబుల్‌, ఎస్‌ఐ పోస్టుల్ని భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎస్సై, ఏఎస్సై, హెడ్‌ కానిస్టేబుల్..

Jobs In CISF: సీఐఎస్‌ఎఫ్‌లో 2000 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. ఈ అవకాశం వారికి మాత్రమే.. 
Follow us on

CISF Recruitment 2021 for 2000 Post: సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ – CISF కానిస్టేబుల్‌, ఎస్‌ఐ పోస్టుల్ని భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎస్సై, ఏఎస్సై, హెడ్‌ కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ), కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 2000 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

అయితే ఈ పోస్టులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో తీసుకోనున్నారు. ఏడాది పాటు కాంట్రాక్ట్‌ పద్ధతిలో తీసుకుని అవసరాన్ని బట్టి మరో రెండేళ్లు పొడగించే అవకాశం ఉంది. ఇక ఎక్స్‌ ఆర్మీ సభ్యులకు మాత్రమే ఈ పోస్టులను ప్రత్యేకంగా కేటాయించారు. ఎక్స్‌ ఆర్మీ సిబ్బంది మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.cisf.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. మొత్తం 2000 ఖాళీల్లో ఎస్సై (63), ఏఎస్సై (187), హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ (424), కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ (1326) భర్తీ చేయనున్నారు. ఇక జీతాల విషయానికొస్తే.. ఎస్సై రూ.40,000, ఏఎస్సై రూ.35,000, హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ  రూ.30,000, కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ రూ.25,000గా ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని 2021 మార్చి 15నుగా నిర్ణయించారు.

Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే 10వ తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగావకాశాలు