ఈ మూడు విషయాలు పాటిస్తే.. పట్టిందల్లా బంగారమే.. ఆచార్య చాణక్య ఏం చెప్పారంటే!

|

Jun 30, 2021 | 3:48 PM

ప్రతీ ఒక్కరూ కూడా లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలని భావిస్తుంటారు. మరి లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టాలంటే.. మూడు విషయాలను గుర్తుపెట్టుకోవాలని ఆచార్య చాణక్య తెలిపారు..

ఈ మూడు విషయాలు పాటిస్తే.. పట్టిందల్లా బంగారమే.. ఆచార్య చాణక్య ఏం చెప్పారంటే!
Chanakya Niti
Follow us on

అసలే లాక్‌డౌన్.. ఆపై అంతంతమాత్రంగా వస్తున్న జీతంతో సామాన్య ప్రజలకు ఇల్లు గడవడం కష్టతరంగా మారింది. నిత్యావసర వస్తువుల ధరల పెంపు.. పన్నుల రూపంలో జేబులకు చిల్లు.. ఇలా ఒకటేమిటీ.. ఎన్నో ఆర్ధిక భారాలను సామాన్య ప్రజలు మోస్తున్నారు. ఈ తరుణంలోనే ప్రతీ ఒక్కరూ కూడా లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలని భావిస్తుంటారు. మరి లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టాలంటే.. మూడు విషయాలను గుర్తుపెట్టుకోవాలని ఆచార్య చాణక్య తెలిపారు. ఆచార్య చాణక్య నీతి ప్రకారం ఆ విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

  1. మూర్ఖులతో వాదించి తనను తాను తెలివైనవాడని నిరూపించుకోవడం కంటే.. తెలివైన వ్యక్తి తిట్లను వినడం మంచిది అని అంటారు. తెలివైన వ్యక్తి తిట్టడం ద్వారా ఎదుట వ్యక్తి ఎన్నో నేర్చుకుంటాడు. అంతేకాకుండా భవిష్యత్తు మెరుగుపడుతుంది. జ్ఞానం ఉన్నవారు ఏ ఇంట్లో అయితే గౌరవాన్ని పొందుతారో.. ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి తనంతట తానుగా వస్తుందని ఆచార్య చాణక్య చెబుతున్నారు.
  2. ఆహారాన్ని సరిగ్గా నిల్వ చేయడమే కాకుండా.. ఆహారాన్ని గౌరవించడం, జంతువులకు, పక్షులకు ఆహారాన్ని పెడతారో.. ఎక్కడైతే కష్టమున్నవారికి సహాయపడతారో.. ఆ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఎలప్పుడూ ఉంటుందని.. కొన్నిసార్లు ఆహార ధాన్యాల్లో కూడా కొరత ఉండదని ఆచార్య చాణక్య అంటున్నారు.
  3. స్త్రీని ఇంటి మహాలక్ష్మిగా భావిస్తారు. స్త్రీని గౌరవించే ఇంట్లో, భార్యాభర్తల మధ్య ఒకరినొకరు గౌరవించుకునే భావన ఉన్న ఇంట్లో ఎప్పుడూ శాంతి ఉండటమే కాకుండా లక్ష్మీదేవి కూడా ఉంటుంది. అలాంటి ఇళ్లల్లో డబ్బుకు కొరత ఉండదు. అదే సమయంలో, ఎల్లప్పుడూ అశాంతి, బాధలు ఉన్న ఇంట్లో, పేదరికాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆచార్య చాణక్య చెప్పారు.

Also Read: 

ఈ ఫోటోలో మరో చిరుత దాగుంది.. కనిపెట్టగలరా! గుర్తు పట్టలేదా.? అయితే ఈ క్లూ ట్రై చేయండి..

బిర్యానీ ఇలా కూడా చేస్తారా! నెటిజన్లు ఫిదా.. వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే!