చాణక్య నీతి : ఆచార్య చాణక్య ఆలోచన సాధారణ ప్రజల నుండి కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఆయన చిన్న వయస్సులోనే వేదాలు, పురాణాల ఔపాసన పెట్టినవాడు. తన సమర్థవంతమైన రాజకీయ వ్యూహం కారణంగా, ఆయన ఒక సాధారణ పిల్లవాడిని చంద్రగుప్తా మౌర్య చక్రవర్తిగా చేశాడు. ఆయన ఆర్థిక శాస్త్ర పండితుడు. అదేవిధంగా, యుద్ధ వ్యూహంలో నిపుణుడు. ఆయన తన జీవితకాలంలో చాలా పుస్తకాలు రాశారు. కానీ, నేటికీ ప్రజలు ఆయన చాణక్య నీతి లోని విషయాలను చాలా ఇష్టపడతారు. ఎందుకంటే ఇందులోని విషయాలు ప్రజల జీవన విధానాన్ని బాగా ప్రభావితం చేస్తాయి.
ఈ పుస్తకంలో, జీవితంలోని అన్ని అంశాలు చెప్పారు ఆచార్య చాణక్య. ఈ పుస్తకం ఏ వ్యక్తి అయినా విజయం సాధించడానికి మార్గంగా మారుతుంది. చాలా మంది ఇప్పటికీ ఈ విషయాలు చదవడానికి ఇష్టపడతారు. ఇందులోని విధానాలను వారి జీవితంలో అనుసరిస్తారు. అన్నీ మంచిగా ఉన్నపుడు మనిషి జీవించడం చాలా బావుంటుంది. కానీ, పరిస్థితులు అనుకూలించనపుడు.. చెడు సమయం వచ్చినపుడు మనిషి ఎలా ఉంటాడనేదే చాలా ముఖ్యం. చెడు పరిస్థితుల్లో ఎలా జీవించాలి అనే విషయాన్ని ఆచార్య చాణక్య తన నీతి పుస్తకంలో సవివరంగా వివరించారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఆచార్య చాణక్య ప్రకారం, ఒకరి భార్య చనిపోతే, ఆ వ్యక్తి రెండవ వివాహం చేసుకోవచ్చు. కానీ వృద్ధాప్యంలో భార్య మరణం అతని దురదృష్టానికి కారణమవుతుంది.
2. చాణక్య ప్రకారం, ఏ వ్యక్తి మరొకరిపై ఆధారపడకూడదు. వేరొకరిపై ఆధారపడిన జీవితం నరకం లాంటిది అతనికి ఎలాంటి స్వేచ్ఛ ఉండదు. గ్రంథాలలో కూడా, ఇతరులతో సమానంగా జీవించే వ్యక్తి అదృష్టం చెడుగా పరిగణిస్తారు.
3. ఒక వ్యక్తి పనికిమాలిన విధంగా డబ్బును ఖర్చు చేస్తే, డబ్బు ప్రాముఖ్యత అతనికి తెలీదని అర్థం. అలాంటి వారి స్వభావం అహంకారంతో ఉంటుంది. ఈ వ్యక్తులు ఏ వ్యక్తిని గౌరవించరు. ఈ వ్యక్తులు నాశనం అయినప్పుడు, వారికి ఏ ఒక్కరూ సహాయం చేయడానికి ముందుకు రారు.
4. చాణక్య ప్రకారం, ఒక వ్యక్తి సంపాదించిన డబ్బు శత్రువుల చేతుల్లోకి వెళితే, అతనికి రెండురకాల నష్టాలు వస్తాయి. ఒకటి, అతని డబ్బు పోతుంది. మరొకటి శత్రువు బలం పెరగడానికి అది ఉపయోగపడుతుంది.
5. కొన్ని లక్షణాలు ఎక్కడి నుంచీ నేర్చుకొనవసరం లేదు. అవి మన మనసులోంచి వస్తాయి. ఒక వ్యక్తికి సహాయం చేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి, ఏది తప్పు ఏది కరెక్ట్ నిర్ణయించాగలగడం వంటి లక్షణాలను ఎవరూ బోధించరు.
6. ఆచార్య చాణక్య ప్రకారం, తన మనస్సులో పాపం, దురాశ ఉన్న వ్యక్తి, అతను బయటి నుండి ఎంత మంచివాడు అయినా, సమయం వచ్చినప్పుడు అతని నిజమైన ప్రవర్తన బయటకు వస్తుంది. అలాంటి వ్యక్తులను దూరం ఉంచండి.
Follow Covid Norms:కరోనా తగ్గిందని ఆలయాలకు వెళ్తున్నారా.. ప్లీజ్ ఇలా చెయ్యకండి..