డ్రైవింగ్ చేయడానికి రోడ్డెక్కుతున్నారా.? అయితే మీ దగ్గర తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే.. లేకపోతే ట్రాఫిక్ పోలీసులు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. మరి మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఓకే.. లేదంటే అప్లయ్ చేసుకోవాలని చూస్తున్నారా.? అయితే ఒక్క నిమిషం ఆగండి. డ్రైవింగ్ లైసెన్స్ కోసం ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయం(RTO) దగ్గర గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. అలాగే డ్రైవింగ్ టెస్టు లేకుండానే లైసెన్స్ జారీ అవుతుంది. అది ఎలాగంటారా..? ఈ స్టోరీ చదవండి మీకే తెలుస్తుంది.
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. డ్రైవింగ్ లైసెన్స్ జారీకి సంబంధించిన కొత్త నిబంధనలు 2022, జూలై 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల రవాణా శాఖలు, లేదా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పలు ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్స్ ఏర్పాటు కానున్నాయి. ఈ శిక్షణా కేంద్రాలు ఐదేళ్ల పాటు చెల్లుబాటులో ఉంటాయి. వీటిల్లో ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఉత్తీర్ణులైనవారికి డ్రైవింగ్ టెస్టు లేకుండానే లైసెన్స్ జారీ చేయనున్నారు. కేవలం ఆయా ట్రైనింగ్ సెంటర్ల సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది.
ప్రైవేటు డ్రైవింగ్ స్కూల్స్ తెరిచేందుకు కావాల్సిన నియమాలు..
రెండు చక్రాలు లేదా నాలుగు చక్రాల వాహనాల ట్రైనింగ్ స్కూల్ కోసం కనీసం 1 ఎకరం స్థలం.. భారీ వాహనాల శిక్షణా కేంద్రం కోసం 2 ఎకరాల స్థలం అందుబాటులో ఉండాలి.