దూసుకొస్తోన్న ‘బూర్జ్‌ ఖలీఫా’ సైజ్‌ ఆస్ట్రాయిడ్‌.. నాసా శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే

దుబాయ్‌లోని ప్రఖ్యాత బూర్జ్‌ ఖలీఫా సైజ్‌ ఉన్న ఓ ఆస్ట్రాయిడ్‌ భూమికి దగ్గరగా వెళ్లనుంది. 153201 2000 WO107 పేరుతో పిలవబడే ఈ ఆస్ట్రాయిడ్

దూసుకొస్తోన్న 'బూర్జ్‌ ఖలీఫా' సైజ్‌ ఆస్ట్రాయిడ్‌.. నాసా శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే
Follow us

| Edited By:

Updated on: Nov 28, 2020 | 11:45 AM

Asteroid to pass earth: దుబాయ్‌లోని ప్రఖ్యాత బూర్జ్‌ ఖలీఫా సైజ్‌ ఉన్న ఓ ఆస్ట్రాయిడ్‌ భూమికి దగ్గరగా వెళ్లనుంది. 153201 2000 WO107 పేరుతో పిలవబడే ఈ ఆస్ట్రాయిడ్ ఆదివారం ఉదయం గం. 10.38ని.లకు(భారత కాలమానం ప్రకారం) 56వేల మైళ్ల వేగంతో ప్రయాణించనుంది. దీని ఎత్తు 800 మీటర్లు, వ్యాసార్థం 500మీటర్లుగా ఉంది. న్యూ మెక్సికోలోని శాస్త్రవేత్తలు ఈ గ్రహశకలాన్ని 2000 సంవత్సరంలో గుర్తించారు. ఇక ఈ ఆస్ట్రాయిడ్ భూమికి దగ్గరగా వస్తున్నప్పటికీ.. భూమికి ఢీకొట్టే అవకాశాలు లేవని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే ఈ గ్రహశకలం భూకక్ష్యను ఢీకొట్టనుందని వారు తెలిపారు.