Telangana 9 ఏళ్ళకు విరబూసిన బ్రహ్మ కమలం.. మహాశివుడికి నైవేధ్యంగా ప్రత్యేక పూజలు

| Edited By: Balaraju Goud

Jul 20, 2024 | 11:07 AM

శివునికి ఇష్టమైన పువ్వు బ్రహ్మకమలం పువ్వులు.. ఇవి తెలంగాణ ప్రాంతంలో అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ బ్రహ్మ కమలం పూలు అంటే ఎక్కువగా హిమాలయ పర్వతాల్లో, కేరళ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి మాత్రమే పూసే ఈ పూలు సిద్ధిపేట జిల్లాలోని పరశురాములు, స్వాతి దంపతుల ఇంటి పెరట్లో విరబూశాయి.

Telangana 9 ఏళ్ళకు విరబూసిన బ్రహ్మ కమలం.. మహాశివుడికి నైవేధ్యంగా ప్రత్యేక పూజలు
Brahmakamalam
Follow us on

శివునికి ఇష్టమైన పువ్వు బ్రహ్మకమలం పువ్వులు.. ఇవి తెలంగాణ ప్రాంతంలో అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ బ్రహ్మ కమలం పూలు అంటే ఎక్కువగా హిమాలయ పర్వతాల్లో, కేరళ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి మాత్రమే పూసే ఈ పూలు సిద్ధిపేట జిల్లాలోని పరశురాములు, స్వాతి దంపతుల ఇంటి పెరట్లో విరబూశాయి.

దుబ్బాక ప్రాంతంలో ఓ కుటుంబం తెగ సంబరపడిపోతోంది. తమ ఇంట్లో ఒక మొక్కకు రెండు బ్రహ్మ కమలం పువ్వులు పూయడంతో ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. శివుడే మా ఇంట్లో వచ్చి శివతాండవం చేసి బ్రహ్మ కమలాల పూయించాడని సంతోషంతో ఆలయంలో శివుని పాదాల వద్ద ఉంచారు ఆ కుటుంబ సభ్యులు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ద్వారా విధులు నిర్వహిస్తున్న బావోజీ పరశురాములు, స్వాతి దంపతులు ఇంట్లో ఈ అద్భుతం వెలుగు చూసింది. 9 సంవత్సరాల క్రితం కేరళ ప్రాంతంలో చిన్న బ్రహ్మ కమలం మొక్కను తీసుకొచ్చి తమ ఇంట్లో పెంచుకుంటున్నారు దంపతులు.

కేరళ ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి డిఫరెంట్‌గా ఉంటుంది. నేల స్వభావాన్ని బట్టి బ్రహ్మ కమలాలు పుష్కలంగా విరబూస్తాయి. కానీ మన ప్రాంతంలో మాత్రం అరుదుగా ఎక్కడో ఒక చోట కనిపిస్తూ ఉంటాయి. అలాంటిది మొక్కకు రెండు కమలాలు పూయడంతో ఆ రెండు పువ్వులను చూసేందుకు ఇరుగుపొరుగు జనం పోటెత్తారు. ఆసక్తిగా వచ్చి శివునికి ఇష్టమైన బ్రహ్మ కమలాలను చూసి తరిస్తున్నారు. పూలు పూయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని కుటుంబసభ్యులు తెలిపారు. శివునికి ఇష్టమైన ఈ పువ్వులని కోసి శివాలయంలో శివుని చెంత ఉంచారు. బ్రహ్మ కమలం పువ్వు బ్రహ్మ కూడా కూర్చుంటారని పురాణాలు చెపుతున్న మాట. 9 సంవత్సరాల తర్వాత ఆ మొక్కకు రెండు బ్రహ్మ కమలాలు వికసించాయి. శివుని అనుగ్రహంతో తమ కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటున్నామని పరశురాములు-స్వాతి దంపతులు తెలిపారు.

వీడియో చూడండి… 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…