
ఈసారి ఏ నోట విన్నా ఒకటే మాట. 50 ఏళ్లుగా వర్షాలు చూస్తున్నా.. ఈస్థాయి వర్షబీభత్సం ఎప్పుడూ చూల్లేదు అని. ఏడాదికొక్క క్లౌడ్‌బరస్ట్ విన్నాం గానీ.. ఈ ఒక్క సీజన్‌లోనే పదికి పైగా మేఘవిస్ఫోటనాలు నమోదవడం ఎన్నడూ జరగలేదని. ఉత్తరాదిన ప్రకృతి ప్రకోపం, దక్షిణాదిన వర్షబీభత్సం. ఇంతేనా..! సిక్స్ మాగ్నిట్యూడ్‌తో భూకంపం చాలాసార్లు, చాలా ప్రాంతాల్లో వచ్చింది. కాని, 2వేల 200 మంది చనిపోవడం చూశామా? ఆప్ఘనిస్తాన్‌లో జరిగింది. కొండచరియలు విరిగిపడి వెయ్యి మందికిపైగా చనిపోవడం విన్నామా? ఊరు మొత్తం నామరూపాల్లేకుండా భూస్థాపితం అవడం చూశామా? సూడాన్‌లో జరిగింది? వర్షాలు, వరదలకు 700 మంది చనిపోయారు. ఎక్కడో కాదు.. పక్కనున్న పాకిస్తాన్‌లోనే. అదీ ఈమధ్యే. ఏంటి ఇంత ప్రకృతి వైపరీత్యం? ఎందుకీ మరణమృదంగం? భాద్రపద పౌర్ణమి.. ఆదివారం. ఈసారి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది. పైగా వెరీ వెరీ స్పెషల్ చంద్రగ్రహణం కూడా. ఈ మధ్య వచ్చిన గ్రహణాలు ప్రపంచంలోని చాలా దేశాలకు కనిపించాయి గానీ భారత్‌లో కనిపించలేదు. చాలాకాలం తరువాత మనదేశంలో సంపూర్ణంగా కనిపిస్తోందీ గ్రహణం. అందులోనూ.. ఇది మామూలు గ్రహణం కాదు. బ్లడ్‌మూన్. చాలా సుదీర్ఘంగా సాగే లూనార్ ఎక్లిప్స్ కూడా. ఐదు గంటల పాటు కొనసాగుతుంది ఈ గ్రహణం. వీలైతే అందరూ తప్పకచూడాల్సిన ఖగోళ అద్భుతం కూడా. ఎందుకు తప్పక చూడాలంటే.. ఈ ఏడాదిలో ఇదే చివరి చంద్రగ్రహణం కాబట్టి. ఈ ఆదివారం రాత్రి సరిగ్గా 9 గంటల 58 నిమిషాలకు ప్రారంభమై.....