Emotional: క్యాన్సర్‌తో పోరాడుతున్న సోదరికి హెయిర్‌ కటింగ్‌.. చెల్లి కన్నీళ్లను తుడిచేందుకు ఈ సోదరుడు ఏం చేశాడో తెలుసా?

క్యాన్సర్‌ బారిన పడిన అమ్మాయి కన్నీళ్లన పంచుకోవాలనుకున్నాడు ఆమె అన్నయ్య. అందుకే ట్రిమ్మర్‌తో ఆమె హెయిర్‌ కట్‌ చేస్తున్నప్పుడు తానూ గుండు చేయించుకున్నాడు. నెట్టింట్లో వైరలవుతోన్న ఈ వీడియోను చూసి నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు.

Emotional: క్యాన్సర్‌తో పోరాడుతున్న సోదరికి హెయిర్‌ కటింగ్‌.. చెల్లి కన్నీళ్లను తుడిచేందుకు ఈ సోదరుడు ఏం చేశాడో తెలుసా?
Brother Sister

Updated on: Oct 13, 2022 | 5:08 PM

ఈ సృష్టిలో అన్నా చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్ల బంధం ఎంతో ప్రత్యేకమైనది. ఇంట్లో చిన్న చిన్న విషయాలకు వారు గొడవపడచ్చు. కానీ ఒకరికి కష్టం వస్తే మరొకరు తట్టుకోలేరు. ముఖ్యంగా చెల్లికి గానీ, అక్కకు కానీ ఏదైనా కష్టమొస్తే చాలు కన్నీళ్లు తుడవడానికి ముందుంటాడు సోదరులు. ఈనేపథ్యంలో అన్నా చెల్లెళ్ల రిలేషన్‌షిప్‌కి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో క్యాన్సర్‌ బారిన పడిన అమ్మాయి కన్నీళ్లన పంచుకోవాలనుకున్నాడు ఆమె అన్నయ్య. అందుకే ట్రిమ్మర్‌తో ఆమె హెయిర్‌ కట్‌ చేస్తున్నప్పుడు తానూ గుండు చేయించుకున్నాడు. నెట్టింట్లో వైరలవుతోన్న ఈ వీడియోను చూసి నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో, ఒక సోదరుడు క్యాన్సర్‌తో పోరాడుతున్న తన సోదరికి హెయిర్‌ కట్‌ చేయడం ప్రారంభిస్తాడు. అమ్మాయిలకు అదనపు అందాన్ని తెచ్చే కురులు కట్‌ చేస్తుంటే ఎవరికీ మాత్రం కన్నీళ్లు రావు చెప్పండి. అందుకే ఆమె కూడా కన్నీరు పెట్టుకుంటుంది. ఇది చూసిన సోదరుడు ఆమెకు అండగా నిలవాలనుకుంటాడు. చెల్లి కన్నీళ్లను పంచుకుంటూ తాను కూడా ట్రిమ్మర్‌తో గుండు చేయించుకుంటాడు.

ఇది చూసిన చెల్లెలు తీవ్ర భావోద్వేగానికి గురైంది. కన్నీళ్లు పెట్టుకుంది. కాసేపటి తర్వాత కుర్చీలో నుంచి లేచి సోదరునికి హెయిర్‌ కట్‌ చేయడంలో సహాయపడుతుంది. ఈ వీడియో @GoodNewsMVT అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఇప్పటివరకు లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించారు. వేలాది కొద్దీ లైకులు, కామెంట్లు వస్తున్నాయి. ఎమోషనల్‌ అవుతున్న నెటిజన్లు ‘అన్నా చెల్లెళ్ల అనుబంధం ఇలాగే ఉంటుంది’, ‘ఇలాంటి పిల్లలను కన్న తల్లిదండ్రులు నిజంగా అదృష్ట వంతులు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా క్యాన్సర్‌ చికిత్సలో భాగంగా వాడే మందులకు కొందరి శరీరం తట్టుకోలేదు. జుట్టు కూడా విపరీతంగా ఊడిపోతుంది. ముఖ్యంగా కీమోథెరపీ చేయించుకున్న వారి విషయంలో ఇలా జరుగుతూ ఉంటుంది. అందుకే క్యాన్సర్‌ బాధితులు తరచూ హెయిర్‌ కట్‌ చేయించుకుంటారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..