
ప్రస్తుత రోజుల్లో చాలా మంది అందంగా కనిపించేందుకు ఆరాటపడుతున్నారు. అందంకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొంత మంది తమ జుట్టు, ముఖ సౌందర్యం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సెలూన్, బ్యూటీ పార్లర్లకు వెళతారు. అలా తరచూగా బ్యూటీ పార్లర్లలో షాంపూ చేయించుకునే వారికి ఇదోక హెచ్చరిక..ఇప్పుడు ‘బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్’ అనే కొత్త సమస్య ప్రజల్ని భయపెడుతోంది. ఇది మీ మెడ, వీపుపై ఒత్తిడి వల్ల కలిగే తీవ్రమైన ఆరోగ్య సమస్య. ఈ అరుదైన పరిస్థితి గురించి ఇక్కడ తెలుసుకుందాం..
చాలా సెలూన్లలో షేవింగ్ చేసిన తర్వాత, లేదంటే హెయిర్ కలర్ వేయించున్న తరువాత అక్కడే హెయిర్ వాష్ చేయించుకుంటారు. ఇందులో వాషింగ్ కోసం ఉపయోగించే బ్యాక్ వాష్ బేసిన్లపై వాలతాము. ఇది మన మెడలను ఇబ్బందికరమైన కోణంలో కుదిస్తుంది. ఇది మెడ నొప్పి, గాయం, చాలా అరుదైన సందర్భాల్లో ప్రాణాంతక స్ట్రోక్‌లకు దారితీస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్‌ను మొదట 1993లో అమెరికన్ న్యూరాలజిస్ట్ మైఖేల్ విన్స్ట్రాబ్ గుర్తించారు. ఈ సమస్యతో బాధపడే ముందు బ్యూటీ పార్లర్‌లో జుట్టును షాంపూతో శుభ్రం చేసుకున్న రోగులకు తీవ్రమైన స్ట్రోక్‌కు సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయని ఆయన కనుగొన్నారు.
స్ట్రోక్ అంటే ఏమిటి? : స్ట్రోక్ అంటే మెదడుకు రక్త ప్రసరణలో అకస్మాత్తుగా అంతరాయం ఏర్పడటం వల్ల కలిగే మెదడు దాడి. ఇది సాధారణంగా రక్తం గడ్డకట్టడం వల్ల వస్తుంది. ఈ సందర్భంలో, ఆక్సిజన్, గ్లూకోజ్, పోషకాలు లేకపోవడం వల్ల మెదడు కణాలు దెబ్బతింటాయి. బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్‌కు ప్రాథమిక కారణం కస్టమర్ తలకు షాంపూతో శుభ్రం చేస్తున్నప్పుడు వాష్‌బేసిన్ అంచున అధిక ఒత్తిడి అని పరిశోధనలు సూచిస్తున్నాయి.
బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్ నివారించడానికి ఏం చేయాలి.? : బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్‌ను నివారించడానికి, బ్యాక్‌వాష్ సింక్‌ను ఉపయోగిస్తున్నప్పుడు మీకు నొప్పి, అసౌకర్యం ఎదురైతే, వెంటనే లేచి మీ మెడకు విశ్రాంతి ఇవ్వండి. లేకపోతే, కొంత వ్యాయామం కోసం మీ మెడను కుడి, ఎడమ వైపుకు తిప్పడానికి ప్రయత్నించండి. మీరు మీ జుట్టును కడుక్కోవాల్సిన అవసరం ఉంటే, ఒత్తిడిని తగ్గించడానికి మీ మెడ కింద ఒక టవల్ పెట్టుకోండి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..