Mysterious Stone: బంగారం కోసం వెతికితే పెద్ద రాయి దొరికింది.. అదేమిటో తెలుసుకుని అవాక్కయ్యాడు!

|

Nov 25, 2021 | 8:12 AM

కొన్నిసార్లు మనమేమి కోరుకుంటామో అది పొందలేము. మరికొన్ని సార్లు ఇది మనకెందుకులే అనుకున్నదానితో అదృష్టం తన్నుకుని వస్తుంది.

Mysterious Stone: బంగారం కోసం వెతికితే పెద్ద రాయి దొరికింది.. అదేమిటో తెలుసుకుని అవాక్కయ్యాడు!
Mysterious Stone
Follow us on

Mysterious Stone: కొన్నిసార్లు మనమేమి కోరుకుంటామో అది పొందలేము. మరికొన్ని సార్లు ఇది మనకెందుకులే అనుకున్నదానితో అదృష్టం తన్నుకుని వస్తుంది. అటువంటి సంఘటనే ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఓ వ్యక్తి విషయంలో జరిగింది. అతను దేనికోసమో వెతుకులాడాడు. కానీ, అది దొరకలేదు. అదేసమయంలో ఎదో వస్తువు దొరికింది. ఎందుకో ఒకదానికి పనికివస్తుందిలే అని దాచి పెట్టుకున్నాడు. అయితే, ఇప్పుడు ఆ వస్తువు అత్యంత అరుదైనదిగా తేలడంతో ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ఆ వ్యక్తి పేరు డేవిడ్ హోల్. ఆయన బంగారం కోసం వెతుకుతున్నప్పుడు ఒక వింత రాయి కంటపడింది. ఇదేదో భలేగా ఉందే అనుకున్నాడు. దానిని జాగ్రత్తగా తన ఇంటికి తీసుకెళ్లి కొన్నాళ్లపాటు ఉంచుకున్నాడు. అయితే,ఇప్పుడు ఆ రాయి నిజానికి 4.6 బిలియన్ సంవత్సరాల నాటి అరుదైన ఉల్క అని తేలింది. అందరినీ ఆశ్చర్యంతో ముంచెత్తిన ఈ సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆస్ట్రేలియా మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం.. డేవిడ్ హోల్ 2015లో మెల్బోర్న్ సమీపంలోని మేరీబరో రీజినల్ పార్క్‌లో బంగారం కోసం వెతకడానికి వెళ్లాడు. ఈ ప్రదేశం పందొమ్మిదవ శతాబ్దంలో బంగారు ‘గని’గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రజలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. బంగారం కోసం ఇక్కడ వెతుకులాడుతారు. కొందరికి కొద్దిపాటి బంగారం దొరికిన సంఘటనలు కూడా ఉన్నాయి. డేవిడ్ హోల్ కూడా అదేవిధంగా బంగారాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఈ అన్వేషణలో, అతను ఓ రాయిని సంపాదించాడు. ఈ రాయి ఓ ఉల్క. ఈ ఉల్క బరువు సుమారు 17 కిలోగ్రాములుగా చెబుతున్నారు.

ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ తన కథనంలో ఆ రాయిలో నగ్గెట్స్ ఉన్నాయని డేవిడ్ భావించాడు. దీంతో అతను దానిని పగలగొట్టడానికి ప్రయత్నించాడు. కానీ సాధ్యం కాలేదు. దీని తర్వాత, ఆరేళ్లపాటు ఆ బండపై దుమ్ము చేరుతూనే ఉంది. డేవిడ్ దాని గురించి ఆలోచించడం కూడా మానేశాడు. అయితే ఇటీవల, ఒక రోజు హఠాత్తుగా డేవిడ్‌కు ఆ శిల గురించి గుర్తు వచ్చింది. ఇది ఎందుకన్నా పనికి వస్తుందా అనే విషయాన్ని తెలుసుకోవాలని అనుకున్నాడు. అతను దానిని మెల్‌బోర్న్ మ్యూజియానికి తీసుకెళ్లాడు. అక్కడ అతను కనుగొన్న ‘వింత’ రాయి వాస్తవానికి ఉల్క అని తెలుసుకున్నాడు.

మ్యూజియంలోని జియాలజిస్ట్ డెర్మోట్ హెన్రీ ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌తో మాట్లాడుతూ, విక్టోరియాలో కనుగొన్న 17వ ఉల్క ఇది అని చెప్పారు. ఉల్కలు మన సౌర వ్యవస్థ యొక్క వయస్సు, నిర్మాణం మరియు రసాయన శాస్త్రం గురించి ఆధారాలను అందించడంలో సహాయపడతాయని ఆయన చెప్పారు. డేవిడ్ హోల్ తెలియకుండా కనిపెట్టిన ఈ రాయికి అది దొరికిన ప్రదేశం పేరు ‘మేరీబరో’ అని పెట్టారు.

ఇవి కూడా చదవండి: International Airport: ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోడీ.. ఎక్కడంటే..

Bigg Boss 5 Telugu: ఇట్స్ ఫ్యామిలీ టైం.. బిగ్‏బాస్ ఇంట్లో కాజల్ కూతురు సందడి..

Andhra Pradesh Floods: ఏపీలో భారీ వరదలకు, అంతమంది ప్రాణాలు పోవడానికి వారే కారణం.. సీపీఐ రామకృష్ణ సంచలన ఆరోపణలు..