
కర్మ ప్రదాత అయిన శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే శనివారం రోజు కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలి. ఆ రోజు కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం, దానం చేయడం వల్ల శని దోషాలు తొలగిపోయి, ఇంట్లోకి ధన ప్రవాహం పెరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
మినపప్పు ప్రీతిపాత్రం..
శనిదేవుడికి మినపప్పు అంటే చాలా ఇష్టం. శనివారం రోజున మినపప్పును ఉడికించి, నైవేద్యంగా సమర్పించి, దానిని పేదలకు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. మినపప్పుతో చేసిన కిచిడీని తినడం ద్వారా గ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా, గులాబ్ జామున్ తినడం కూడా శనికి చాలా ప్రీతికరమైనదిగా భావిస్తారు. ఈ రోజున ఇనుము, తోలుతో చేసిన వస్తువులు, ఉప్పు వంటి వాటిని ఇంటికి తీసుకురావడాన్ని అశుభంగా భావిస్తారు. శనివారం సాయంత్రం వేళ, పవిత్రమైన రావి చెట్టు కింద నువ్వుల నూనె లేదా ఆవాల నూనెతో దీపం వెలిగించడం చాలా శుభప్రదం. ఇలా చేయడం వల్ల శని దోషాలు తొలగిపోయి, జీవితంలో ఎదురయ్యే కష్టాలు తగ్గుతాయని నమ్మకం. ఈ ఆచారాలు పాటిస్తే శనిదేవుడు శాంతించి, ఆశీస్సులు అందించి, ఇంట్లో ధన ప్రవాహానికి, సుఖసంతోషాలకు మార్గం సుగమం చేస్తాడని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. ఇలాంటి నియమాలను పాటించడం ద్వారా జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని చాలామంది విశ్వసిస్తారు