
జీవితాన్ని సంతోషంగా, సులభతరం చేయడానికి జ్యోతిష్యం అనేక నివారణలను వివరిస్తుంది. ఈ నివారణలలో కొన్ని చాలా ఖరీదైనవి, మరికొన్ని సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉండేవి ఉన్నాయి. అవి చాలా సులభమైనవి. సరళమైనవి కూడా. వీటిలో ఒకటి పాదాల చుట్టూ నల్ల దారం కట్టుకోవడం. మీరు చాలా మందిని, ముఖ్యంగా స్త్రీలను పాదాల చుట్టూ నల్ల దారం కట్టుకోవడం చూసి ఉంటారు.. అంతేకాదు.. నేటి మారుతున్న కాలంలో పాదాలకు నల్ల దారం కట్టుకోవడం ఫ్యాషన్‌గా మారింది. అయితే, చాలా మంది మహిళలు దీని గురించి తెలియకుండానే తమ పాదాలకు నల్ల దారం కట్టుకుంటారు. కానీ, ఇది వారి జీవితాల్లో సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఏ కాలికి నల్లదారం కట్టుకోవాలి..? దాని వల్ల కలిగే ఫలితాలేంటో ఇక్కడ చూద్దాం..
కాలికి నల్ల దారం ఎప్పుడు కట్టుకోవాలి?
జ్యోతిషశాస్త్రం ప్రకారం, నల్ల దారం శని దేవుడిని సూచిస్తుంది. చెడు కన్ను, ప్రతికూల శక్తుల ప్రభావాన్ని నివారించడానికి పాదాల చుట్టూ నల్ల దారాన్ని కట్టవచ్చు. నల్ల దారాన్ని పాదాలకే కాకుండా మణికట్టు, చేతులకు కూడా కట్టుకోవచ్చు. మహిళలు దిష్టి తగలకుండా ఉండేందుకు, జీవితంలో అన్ని సమస్యలను తొలగించడానికి కాలికి నల్లదారం కట్టుకుంటూ ఉంటారు. శనిదేవుని ఆశీస్సులు ఉంటే ఆరోగ్య సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయి. అయితే దారాన్ని మరీ వదులుగా లేదా బిగుతుగా కట్టకూడదని గుర్తుంచుకోండి.
కానీ, జ్యోతిషశాస్త్రం ప్రకారం, నల్ల దారం కట్టడానికి శనివారం చాలా శుభప్రదమైన రోజు. దిష్టి తగలకుండా ఉండటానికి అమ్మాయిలు, మహిళలు తమ ఎడమ కాలికి నల్ల దారం కట్టుకుంటారు. శనివారం ఉదయం స్నానం చేశాక శని ఆలయానికి వెళ్లి, దేవునికి నూనె సమర్పించి, మంత్రం పఠిస్తూ ఎడమ కాలికి దారం కట్టుకోవాలి.
మీరు వ్యాపారంలో లేదా ఉద్యోగంలో నిరంతరం ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుంటే, మీరు మీ పాదాలకు నల్ల దారం ధరించవచ్చు. స్త్రీ, పురుషులు వివాహంలో అడ్డంకులు ఎదుర్కొంటుంటే లేదా వైవాహిక జీవితంలో నిరంతరం సమస్యలను ఎదుర్కొంటుంటే అటువంటి పరిస్థితిలో మీరు శనివారం నల్ల దారం ధరించవచ్చు. మీ జాతకంలో శని, రాహు-కేతువుల స్థానం చెడుగా లేదా బలహీనంగా ఉంటే, మీరు మీ పాదాలకు నల్ల దారం ధరించాలి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.