Supermarket Fruits: సూపర్‌ మార్కెట్లో పళ్లు కొంటున్నారా..? వీటిని తప్పకుండా గమనించండి..!

Supermarket Fruits: సూపర్‌ మార్కెట్‌లో అమ్మే పళ్లు, కాయగూరలను గమనిస్తే వాటిపై ఏవో లేబుల్స్‌ అతికించి ఉంటాయి. కానీ చాలా..

Supermarket Fruits: సూపర్‌ మార్కెట్లో పళ్లు కొంటున్నారా..? వీటిని తప్పకుండా గమనించండి..!

Edited By:

Updated on: Jan 25, 2022 | 7:59 AM

Supermarket Fruits: సూపర్‌ మార్కెట్‌లో అమ్మే పళ్లు, కాయగూరలను గమనిస్తే వాటిపై ఏవో లేబుల్స్‌ అతికించి ఉంటాయి. కానీ చాలామంది వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. ఆ లేబుల్‌… ఉత్పత్తి చేసేవాడికి, అమ్మేవాడికి మాత్రమే సంబంధించిన విషయంగా భావిస్తారు. నిజానికా లేబుల్‌ వినియోగదారుడు తను కొంటున్న వస్తువు ఎలాంటిదో తెలుసుకోవడానికి ఉద్దేశించినది.

ప్రస్తుతం ఎక్కడ ఎవరి నోట విన్నా ఆర్గానిక్‌ అనే మాట వినిపిస్తోంది. ఆర్గానిక్‌ కాయగూరలు, పళ్లు అంటే సేంద్రీయ ఎరువులు వేసి సహజ పద్ధతుల్లో పండించినవని మనకు తెలుసు. అందుకే అవి ఆరోగ్యానికి మంచివని కొంచెం ఖరీదు ఎక్కువైనా కొంటుంటాం. ముఖ్యంగా పళ్ల రసాలకి ఆర్గానిక్‌ పళ్లే శరణ్యం. ఎందుకంటే పళ్లరసాలు త్వరగా జీర్ణమై మన శరీరంలో కలిసిపోతాయి. ఆ పళ్లరసం పెస్టిసైడ్స్‌, ఫంగిసైడ్స్‌ వేసి, రసాయనిక ఎరువులు వాడి పండించిన పళ్లనుంచి తయారు చేసినదైతే… పళ్లరసం తీసుకున్న వెంటనే విష పదార్థాలు నేరుగా మన శరీరంలో కలిసిపోతాయి. దానివల్ల అప్పటికప్పుడు ఆరోగ్యం పాడు కావడంతో పాటు.. భవిష్యత్తులో క్యాన్సర్‌ వంటి ప్రమాదకర జబ్బుల బారిన పడే అవకాశం ఉంది.

మరి ఏవి సహజ పద్ధతుల్లో పండించినవి? ఏవి పురుగు మందులు, రసాయనిక ఎరువులు వేసి పండించినవి? ఏవి జన్యుమార్పిడి ద్వారా పండించినవి?… అని తెలుసుకోవాలంటే పళ్ళు, కాయగూరలపై వేసే లేబుల్స్‌ను జాగ్రత్తగా గమనించాలి.

► ఆపిల్‌కున్న లేబుల్‌పై నాలుగు అంకెలు ఉండి, మొదటి అంకె మూడు లేదా నాలుగు ఉంటే రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడి పండించిన పంట.

► లేబుల్‌పై అయిదు అంకెలు ఉండి… మొదటి అంకె ఎనిమిది అయితే జన్యుమార్పిడి ద్వారా పండించిన పంట.

► లేబుల్‌పై అయిదు అంకెలు ఉండి… మొదటి అంకె తొమ్మిది ఉన్నట్లయితే అది ఆర్గానిక్‌ పంట.

► ఇక పళ్లపై లేబుల్‌ని పిల్లలు చూసుకోకుండా తినేస్తే గాభరా పడాల్సిన అవసరం లేదు. ఆ లేబుల్‌ కాగితాన్ని తినదగిన పేపర్‌తోనే తయారు చేస్తారు. అంతేకాదు.. ఆ లేబుల్‌ని అతికించడానికి ఉపయోగించే జిగురు సైతం తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలతోనే తయారవుతుంది.

ఇవి కూడా చదవండి:

Basil Health Benefits: తులసితో అద్భుతమైన ఉపయోగాలు.. పలు అధ్యయనాలలో కీలక విషయాలు!

Turmeric Milk: పసుపు పాలు తాగితే ఏమవుతుంది…? ఎలాంటి ప్రయోజనాలు..!