ప్రముఖ ఆన్లైన్ మార్కెట్ అమెజాన్‍లో ఎలక్ట్రిక్ వస్తువుల దగ్గర్నుంచి నిత్యావసర సరుకుల వరకు అన్ని దొరుకుతాయి. ఇక చివరికి పిడకలను కూడా కొనుక్కోవచ్చు. దేశవిదేశాల్లో ఉండే భారతీయుల కోసం ఈ పిడకలను అమ్ముతున్నారు. వీటిని పూజకు, హోమం కోసం వాడుతుంటారు. దీనిని కౌ డంగ్ కేక్ పేరుతో అమెజాన్ విక్రయిస్తుంది. అయితే ఈ కౌ డంగ్ కేక్ అంటే కొంత మంది కొత్తరకం కేక్ అనుకుంటున్నారు. అనుకోవడమే కాదండోయ్.. వాటిని కొనుగోలు చేసి టేస్ట్ కూడా చూసేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ పిడకలను టేస్ట్ చూసిన ఓ కస్టమర్ ఇచ్చిన రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అమెజాన్‍లో పిడకలు కొని ఓ కస్టమర్ దానిని టేస్ట్ చేశాడు. అది తిన్న తర్వాత అతను దానికి అదిరిపోయే రివ్యూ ఇచ్చాడు. ” దీన్ని నేను తిన్నాను. టేస్ట్ అస్సలు బాగోలేదు. దీని రుచి గడ్డి-బురద కలిసినట్లుగా ఉంది. దీనిని తిన్న తర్వాత నాకు విరోచనాలు పట్టుకున్నాయి. దయచేసి తీని తయారి సమయంలో పరిశుభ్రత విధానాలు పాటించండి. అంతేకాకుండా దీని టేస్ట్ మీద కూడా సరైన దృష్టి పెట్టండి” అంటూ రివ్యూలో పేర్కోన్నాడు. ఈ రివ్యూను డాక్టర్ సంజయ్ అరోరా అనే వ్యక్తి తన ట్విట్టర్లో షేర్ చేశాడు. అయితే ఇందులో అమెజాన్ తప్పేమి లేదు. అందులో పిడకలను దేనికి ఉపయోగిస్తారనే విషయాన్ని వివరంగా పొందుపరిచారు. వాటిని కేవలం పూజలు, హోమాల కోసం వాడతారని.. 10 శాతం పేడతో దీనిని తయారు చేశారని అందులో పేర్కోన్నారు. అయితే వాటిని కాల్చడం ద్వారా గాలిలోని కలుషితాలు నాశనమవుతాయని, అంతేకాకుండా అవి బాగా మండుతాయని తెలిపారు. ఇక ఆ పిడకలను అతడు నిజంగా తిన్నాడా ? లేదా కావాలనే వాటిని ఆర్డర్ చేసి.. అలా రివ్యూ ఇచ్చాడా అనే సందేహం కలుగుతుంది.
Guess what! .@IndiaToday picked up this tweet from me and has given due credit too! The shit has truly hit the fan!?https://t.co/Dg89XrPr3P
— Dr. Sanjay Arora PhD (@chiefsanjay) January 21, 2021
Also Read:
Facebook: కీలక నిర్ణయం తీసుకున్న ‘ఫేస్బుక్’.. ఇకనుంచి ఆ ఆప్షన్ కనిపించదు.. రీడిజైన్ చేయనున్న..