అందం కోసం కలబంద జెల్..! పొడి బారిన చర్మానికి చక్కటి పరిష్కారం.. ఒక్కసారి ట్రై చేసి చూడండి..

|

May 16, 2021 | 3:02 PM

Aloevera Benefits : వేసవి దాని స్వభావాన్ని చూపించడం ప్రారంభించింది. సూర్యుని కిరణాలు వేగంగా చర్మంపై ప్రభావాన్ని చూపుతాయి.

అందం కోసం కలబంద జెల్..! పొడి బారిన చర్మానికి చక్కటి పరిష్కారం.. ఒక్కసారి ట్రై చేసి చూడండి..
Aloevera Gel
Follow us on

Aloevera Benefits : వేసవి దాని స్వభావాన్ని చూపించడం ప్రారంభించింది. సూర్యుని కిరణాలు వేగంగా చర్మంపై ప్రభావాన్ని చూపుతాయి. వేడి గాలులు ముఖంలో జీవం లేకుండా చేస్తాయి. ఈ సీజన్‌లో చర్మానికి కోల్డ్ క్రీమ్ ఎంత అప్లై చేసినా వృథా. సూర్యరశ్మి నుంచి రక్షించగల సహజ ఉత్పత్తులు అవసరం. కలబంద చర్మానికి మంచి ఔషధంగా పని చేస్తుంది. ఇందులో అనేక రకాల సుగుణాలు ఉన్నాయి. విటమిన్లు, ఖనిజాలు, సాలిసిలిక్ ఆమ్లం, లిగ్నిన్, సాపోనిన్ ఉంటాయి. ఇది చర్మాన్ని పూర్తిగా కాపాడుతుంది.

1. అన్ని చర్మ రుగ్మతలను నయం చేస్తుంది: అలోవెరో చర్మంపై దద్దుర్లు, దురద, మంట నుంచి తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఇది శీతలీకరణ లక్షణాలను కలిగి ఉంటుంది. రాత్రి పడుకునే ముందు కలబంద జెల్ అప్లై చేయాలి ఉదయానికి మీ సమస్య పరిష్కారం అవుతుంది.

2. అన్ని చర్మ రకాలకు పనిచేస్తుంది : ఔషధ గుణాలతో సమృద్ధిగా ఉండే అలోవేరా అన్ని చర్మ రకాలకు అనుకూలంగా ఉంటుంది. జిడ్డు చర్మం, పొడి చర్మం, సున్నితమైన చర్మం ఉన్నవారు ఎవరైనా ఉపయోగించవచ్చు.

3. సూర్య కిరణాల నుంచి రక్షిస్తుంది: కలబందను సౌందర్య ఉత్పత్తులలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది హైడ్రేటింగ్, మాయిశ్చరైజింగ్ వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని హానికరమైన అతినీలలోహిత కిరణాల నుంచి రక్షిస్తుంది. వేసవి కాలంలో కలబందను వాడటం వల్ల పొడి చర్మాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా సూర్యుడి హానికరమైన ప్రభావాల నుంచి రక్షిస్తుంది.

4. సున్నితమైన చర్మం కోసం కలబంద ప్యాక్ : చర్మం సున్నితంగా ఉన్నవారి ముఖంపై మొటిమలు కనిపిస్తాయి. వారి వయస్సు కూడా ఎక్కువగా కనిపిస్తుంది. మీ చర్మం సున్నితంగా ఉండాలంటే కలబంద, బొప్పాయి పేస్ట్ అప్లై చేయండి. ఇది మీకు చాలా సహాయపడుతుంది. ఈ ప్యాక్ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది మొటిమలను నివారిస్తుంది. ఇది ముఖానికి ఆకస్మిక మెరుపును కూడా తెస్తుంది.

5. కలబంద జెల్ చర్మంపై ఉన్న టాన్ తొలగిస్తుంది : మొదట ఫేస్ వాష్ తో ముఖం కడుక్కొని పూర్తిగా తుడవండి. కలబంద జెల్ ను మీ ముఖం మీద రాయండి. మీకు కావాలంటే ఏదైనా ముఖ్యమైన నూనెను కూడా జోడించవచ్చు. దీన్ని ముఖం మీద తేలికగా అప్లై చేసి రాత్రిపూట వదిలేయండి. దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల సన్ టాన్, మొటిమల నుంచి ఉపశమనం లభిస్తుంది.

జాజికాయ నూనె గురించి మీకు తెలుసా..? అద్భుత ఫలితాలు.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..

మహిళలతో పోలిస్తే పురుషుల చర్మం చాలా కఠినం..! అందమైన ముఖ తేజస్సు కోసం వీటిని ఫాలోకండి..

New Symptoms of Corona: నాలుక పొడిబారడం.. దురద కూడా కోవిడ్ లక్షణాలు కావచ్చు.. బెంగుళూరు డాక్టర్ హెచ్చరిక!