Agarbatti Making: అగరుబత్తీల తయారీతో అదిరే లాభాలు.. కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారికి సువర్ణావకాశం

భారతదేశం అగరుబత్తీలకు సంబంధించిన సుగంధ ద్రవ్యాల సరఫరాదారుగా ఉంది. ఈ సువాసనతో కూడిన కూర్పులు అనేక దేవతలను పూజించడానికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా పూజతో పాటు ధ్యానం సమయంలో ఓ పాజిటివ్‌ ఎనర్జీ కోసం అగరుబత్తీలను ఉపయోగిస్తారు. ప్రతి ఇంట్లో విరివిగా వాడే ఈ అగరుబత్తీలకు మార్కెట్‌లో అత్యధిక డిమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలో యువత అగరుబత్తీల వ్యాపారంలో అడుగుపెట్టడానికి ఇదే సరైన సమయమని నిపుణులు చెబుతున్నారు.

Agarbatti Making: అగరుబత్తీల తయారీతో అదిరే లాభాలు.. కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారికి సువర్ణావకాశం
Agarbatti Making

Updated on: Jan 25, 2024 | 6:30 AM

ప్రపంచంలోనే అగరుబత్తి ఉత్పత్తి చేయడంలో భారతదేశం అగ్రగామిగా ఉంది. అగరబత్తిలతో పాటు దూప్‌స్టిక్స్‌ తయారీలో కూడా ప్రాముఖ్యతను కలిగి ఉంది. భారతీయ ఆచారాల్లో దూపం వేయడం అనేది ముఖ్యమైన భాగం. భారతదేశం అగరుబత్తీలకు సంబంధించిన సుగంధ ద్రవ్యాల సరఫరాదారుగా ఉంది. ఈ సువాసనతో కూడిన కూర్పులు అనేక దేవతలను పూజించడానికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా పూజతో పాటు ధ్యానం సమయంలో ఓ పాజిటివ్‌ ఎనర్జీ కోసం అగరుబత్తీలను ఉపయోగిస్తారు. ప్రతి ఇంట్లో విరివిగా వాడే ఈ అగరుబత్తీలకు మార్కెట్‌లో అత్యధిక డిమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలో యువత అగరుబత్తీల వ్యాపారంలో అడుగుపెట్టడానికి ఇదే సరైన సమయమని నిపుణులు చెబుతున్నారు. కనీస పెట్టుబడితో గణనీయమైన రాబడినిచ్చే అగరుబత్తీల వ్యాపారం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. 

అగరుబత్తీల వెదురు కర్రలతో తయారు చేస్తారు. కర్రకు సహజంగా లభించే సువాసనగల పువ్వులు లేదా గంధం వంటి ఇతర సుగంధ ముద్దలతో పూత పూస్తారు. దాదాపు ప్రతి భారతీయ ఇంటిలో అగరుబత్తీలను ఉపయోగిస్తారు. 90కి పైగా దేశాలలో కూడా అగరుబత్తీలను ఉపయోగిస్తారు. అగర్బత్తి వ్యాపారాన్ని నిర్వహించడానికి, ప్రత్యేక స్థలం అవసరం లేదు. దీన్ని ఇంట్లోనే సులభంగా ప్రారంభించవచ్చు. భారతదేశం అంతటా ముఖ్యంగా పండుగల సమయంలో అగరుబత్తీలకు డిమాండ్ పెరుగుతుంది. అగర్బత్తి పరిశ్రమలో అనేక సంస్థలు ఉన్నప్పటికీ కొత్త సువాసనలను మార్కెట్‌కు పరిచయం చేయగలిగితే ఉత్పత్తి త్వరగా ప్రజాదరణ పొందుతుంది. ముందుగా, అగరబత్తుల తయారీ సంస్థను ప్రారంభించడానికి లైసెన్స్ అవసరం. అదనంగా కంపెనీకి జీఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా అవసరం. 

చిన్న స్థాయిలో ఇంటి నుండి ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా రూ. 40 నుంచి 80,000 వరకు ఖర్చు అవుతుంది. ప్రతి నెలా రూ. 1.5 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. లాభం రూ.50,000 నుంచి రూ.60,000 వరకు ఉంటుంది. అయితే మీ ఉత్పత్తి కనుక ప్రజలను ఆకట్టుకుంటే డిమాండ్ కూడా పెరగుతుంది. అయితే అగరుబత్తీల వ్యాపారానిఇక బ్రాండింగ్, ప్రకటనలు చాలా అవసరం. అలా కాకుండా పర్యావరణాన్ని రక్షించే మార్గంగా పర్యావరణ అనుకూలమైన అగర్బత్తీలను కూడా తయారు చేసి కొనుగోలుదారులను ఆకట్టుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..