Adolf Hitler: ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన నియంత అడాల్ఫ్ హిట్లర్.. పెళ్లయిన కొన్ని గంటలకే బంకర్‌లో ఆత్మహత్య..!

|

Apr 30, 2022 | 12:20 PM

Adolf Hitler: ప్రపంచంలోని అత్యంత క్రూరమైన నియంతలలో అడాల్ఫ్ హిట్లర్ ఒకరు. కానీ పిరికివాడిలా చనిపోవాల్సి వస్తుందని బహుశా ఊహించి ఉండడు.

Adolf Hitler: ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన నియంత అడాల్ఫ్ హిట్లర్.. పెళ్లయిన కొన్ని గంటలకే బంకర్‌లో ఆత్మహత్య..!
Adolf Hitler
Follow us on

Adolf Hitler: ప్రపంచంలోని అత్యంత క్రూరమైన నియంతలలో అడాల్ఫ్ హిట్లర్ ఒకరు. కానీ పిరికివాడిలా చనిపోవాల్సి వస్తుందని బహుశా ఊహించి ఉండడు. 1945వ సంవత్సరం ఏప్రిల్‌ 30 అంటే సరిగ్గా ఈ రోజున అతను తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. జర్మనీకి చెందిన ఈ క్రూర నియంత తన హయాంలో యూదులను ఘోరంగా హింసించాడు. ఆరు మిలియన్ల యూదులను గ్యాస్ ఛాంబర్లలో బంధించి చిత్రహింసలకి గురిచేస్తాడు. వాస్తవానికి 30 ఏప్రిల్ 1945న సోవియట్ బలగాలు చుట్టుముట్టిన తర్వాత హిట్లర్ బెర్లిన్‌లోని నేల నుంచి 50 అడుగుల దిగువన ఉన్న బంకర్‌లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ క్రమంలో అతడి భార్య కూడా ఆత్మహత్యకు పాల్పడుతుంది.

ఇటాలియన్ నియంత హత్యతో హిట్లర్ భయపడ్డాడు

వాషింగ్టన్ పోస్ట్‌లోని ఒక నివేదిక ప్రకారం.. ఇటాలియన్ నియంత ముస్సోలినీ హిట్లర్‌కు అత్యంత సన్నిహితుడు. ఇతడు కూడా హిట్లర్‌ లాగే ఒక నియంత. హిట్లర్ ఆత్మహత్యకు రెండు రోజుల ముందు అతను దారుణంగా హత్యకి గురవుతాడు. ఈ విషయం హిట్లర్‌కు తెలియగానే చాలా ఉద్వేగానికి లోనవుతాడు. జర్మనీ ప్రజలు తనని కూడా అలాగే చేస్తారని భయపడుతాడు. నిజానికి ఇటలీలో ముస్సోలినీని మొదట కాల్చి చంపుతారు. ఆపై అతని శరీరాన్ని ఉరితీస్తారు. కోపంతో ఉన్న జనం అతని శరీరంపై రాళ్లు రువ్వుతారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న హిట్లర్ చాలా భయపడుతాడు. ఎలాగైన ప్రజలకి లొంగిపోకూడదని నిర్ణయించుకుని ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు.

ఆ చివరి రోజుల్లో ఏం జరిగింది?

తన చివరి రోజుల్లో హిట్లర్ తన సన్నిహితులు తనకు ద్రోహం చేస్తారని ఆందోళన చెందాడు. కమాండర్లలో ఒకరైన ఫెలిక్స్ స్టెయినర్ అతని ఆజ్ఞను పాటించడానికి నిరాకరించినప్పుడు అతను ఆశ్చర్యపోతాడు. అంతేకాదు మానసికంగా బాధపడుతాడు. ఈలోగా తన ప్రాణ స్నేహితుడు ముస్సోలినీ మరణం గురించి తెలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. హిట్లర్ పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది. హిట్లర్ తన స్నేహితురాలు ఎవా బ్రాన్‌ను బంకర్‌లో వివాహం చేసుకుంటాడు. అయితే వేడుకలు ఏమి ఉండవు. ఏప్రిల్ 29 రాత్రి ఒంటిగంట సమయంలో ఫీల్డ్ మార్షల్ విలియం కీటెల్ సైన్యం చుట్టుముట్టిందని హిట్లర్‌తో చెబుతాడు. హిట్లర్ ఎలాగైనా వారికి లొంగిపోకూడదని నిర్ణయించుకుంటాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో హిట్లర్ తన భార్య ఎవా బ్రాన్, మరికొందరు కార్యదర్శులతో కలిసి భోజనానికి కూర్చుంటాడు. అప్పుడు పెద్ద ఎత్తున కాల్పులు జరుగుతుంటాయి. కొద్దిసేపటి తర్వాత హిట్లర్ గదిని తెరిచి చూడగా హిట్లర్ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కనిపిస్తాడు. ఎవా బ్రౌన్ సైనైడ్ తాగి ఆత్మహత్య చేసుకుంటుంది.

మరిన్ని హ్యూమన్ వార్తలకి ఇక్కడ క్లిక్ చేయండి

Viral Video: కరెంట్‌ స్తంభం ఎక్కిన ఎలుగుబంటి.. పక్కనే హై వోల్టేజ్ వైర్.. తర్వాత ఏం జరిగిందంటే..!

Viral Video: చిరుత వేగం ముందు ఎవ్వరైనా దిగదుడుపే.. వేట మామూలుగా లేదుగా..!

Sunrise Points: ఈ ప్రదేశాలలో సూర్యోదయాన్ని చూస్తే మైమరచిపోతారు..!