Vastu Tips: అద్దె ఇంటి కోసం చూస్తున్నారా.? ముందు ఈ విషయాలు తెలుసుకోండి..

|

Mar 27, 2024 | 4:51 PM

అయితే ఈ వాస్తు నియమాలు కేవలం సొంతింటికే వర్తిస్తాయని, అద్దె ఇంటికి వర్తించవని చాలా మంది అనుకుంటారు. అయితే ఇది తప్పుడు అభిప్రాయమని పండితులు చెబుతున్నారు. అద్దె ఇల్లు, సొంతిళ్లు అనే తేడా లేకుండా వాస్తు ప్రతీ ఇంటికి కచ్చితంగా పాటించాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ అద్దె ఇంటి కోసం వెతుకే సమయంలో ఎలాంటి వాస్తు...

Vastu Tips: అద్దె ఇంటి కోసం చూస్తున్నారా.? ముందు ఈ విషయాలు తెలుసుకోండి..
Vastu Tips
Follow us on

వాస్తు విషయంలో కచ్చితంగా కొన్ని నియమాలను పాటిస్తుంటారు. మరీ ముఖ్యంగా భారతీయులను వాస్తును విడతీసి చూడని పరిస్థితి ఉంటుంది. అందుకే ఇంటి నిర్మాణం మొదలు ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయం వరకు ప్రతీ విషయం వాస్తు పరంగా ఉండేలా చూసుకుంటారు. వాస్తు సరిగ్గా లేకపోతే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు పండితులు సైతం చెబుతుంటారు.

అయితే ఈ వాస్తు నియమాలు కేవలం సొంతింటికే వర్తిస్తాయని, అద్దె ఇంటికి వర్తించవని చాలా మంది అనుకుంటారు. అయితే ఇది తప్పుడు అభిప్రాయమని పండితులు చెబుతున్నారు. అద్దె ఇల్లు, సొంతిళ్లు అనే తేడా లేకుండా వాస్తు ప్రతీ ఇంటికి కచ్చితంగా పాటించాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ అద్దె ఇంటి కోసం వెతుకే సమయంలో ఎలాంటి వాస్తు చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* అద్దె ఇంటి కోసం వెతుకుతున్న సమయంలో ఈశాన్యంలో ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవాలని పండితులు చెబుతున్నారు. అలాగే ఈశాన్యంలో డోర్‌కి, ఇంటికి మధ్య ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

* ఇళ్లు ఏదైనా కచ్చితంగా ఆగ్నేయంలో వంట గది ఉండాలి. ఇంటికి వంటిల్లు ఎంతో ముఖ్యమైంది. పొరపాటున కూడా వంట గది ఇతర దిశల్లో ఉంటే ఆ ఇంట్లోకి అద్దెకు దిగకుండా ఉంటేనే బెటర్‌.

* ఇక అద్దె ఇంటికి ఎట్టి పరిస్థితుల్లో నైరుతి దిశలో బాల్కనీ లేకుండా చూసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. నైరుతిలో బాల్కనీ ఉంటే అది ఇంట్లో ఉండే వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెబుతున్నారు.

* అలాగే ఇల్లు వీలైనంత వరకు అన్ని దిశల్లో ఒకే రకంగా ఉండేలా చూసుకోవాలి. ఒక సైడ్‌ ఎక్కువగా మరో సైడ్‌ తక్కువగా ఉండకుండా చూసుకోవాలి. దీర్ఘచతురస్రాకారంలో ఇల్లు ఉంటే మంచిదని వాస్తు పండితులు చెబుతున్నారు.

* ఇక ఎట్టి పరిస్థితుల్లో బెడ్‌ రూమ్‌ నైరుతి, దక్షిణ, పశ్చిమం వైపు ఉండేలా చూసుకోవాలి. అలాకాకుండా వేరే దిశలో ఉంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు.

* అద్దె ఉండే ఇంటికి ఎట్టి పరిస్థితుల్లో వీధి పోటు లేకుండా చూసుకోవాలి. మీరు ఆ ఇంటికి యజమాని కాకపోయినా వీధిపోటు ఉంటే ఆ ఇంట్లో నివాసం ఉండే వారు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని చెబుతున్నారు.

* మీరు అద్దెకు ఉండే ఇల్లు రోడ్డు నుంచి పల్లంగా ఉండకుండా చూసుకోవాలి. ఇలా ఉంటే ఇంట్లో ఉండే వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.

* ఇదిలా ఉంటే ఇక టాయిలెట్ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దక్షిణం, పశ్చిమ దిశలో బాత్‌రూమ్‌లు ఉండకుండా చూసుకోవాలని చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు వాస్తు పండితులు తెలిపిన విషయాలు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయత లేదని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..