మహాత్మ గాందీ జయంతిని పురష్కరించుకొని ఓ విద్యార్థి వేసిన మైక్రో ఆర్ట్ గాంధీ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. నంద్యాల పట్టణానికి చెందిన మురళీధర్ అర్చన దంపతుల కుమారుడు సాహిత్ గత కొంత కాలంగా కోటేష్ ఆర్ట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు.సాహిత్ గురువైన ప్రముఖ చిత్రకారుడు కోటేష్‌ను ఆదర్శంగా తీసుకొని వినూత్నమైన అలోచనతో గాంధీ చిత్రాన్ని గీశాడు.
13 అంగుళాల పొడవు, 10 అంగుళాల వెడల్పు ఉన్న డ్రాయింగ్ షీట్ పై 3,725 చిన్న రంగు రాళ్లను క్రమంగా అతికిస్తూ ఎంతో శ్రద్దతో గాంధీ చిత్రాన్ని వేశాడు. ఈ చిత్రాన్ని వేయడానికి సుమారు 3 గంటల సమయం పట్టినట్లు చిత్రకారుడు సాహిత్ తెలిపారు.
తొమ్మిదవ తరగతి చదువుతున్న సాహిత్ చిన్నవయసులోనే ఎంతో కళాత్మకంగా వేసిన గాంధీజీ మైక్రో క్రాఫ్ట్ కళ అందరినీ ఆకట్టుకుంటుంది. గాంధీజీ చిత్రాన్ని అద్భుతంగా వేసిన సాహిత్‌ను ప్రముఖ చిత్రకారుడు కోటేష్ అభినందించారు. చిన్న వయసులోనే ఆర్ట్ పై ఎంతో మక్కువ ఉండటం ఎంతో గొప్పవిషయం అంటూ చిత్రకారులు బాలుడిని ప్రశంసిస్తున్నారు . ప్రస్తుతం కోటేష్ వేసిన ఆర్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.